Menu Close
Kadambam Page Title
మరో తప్పు
-- చందలూరి నారాయణరావు

ఇది పొరపాటని,
అది తప్పని,
చెప్తే తెలియవు...
అనుభవంలోకి వచ్చాక
చెప్పడాలుండవు.

అజ్ఞానం అడుగు పెద్దదని,
అమాయకానిది తప్పటడుగని,
అర్ధం పోల్చుకోలేక పోయానని
దాగలేక పోయినని ఎన్ని చెప్పినా
పాఠం చెప్పి తీరుతుంది.
గుణపాఠమై గుర్తుంటుంది.

మనసు లేఖలా మోకరిల్లి
చదిచించలేని అసమర్ధత
సిగ్గుతో ముడుచుకొంది.

క్షమించమని అడగడం
క్షమించరాని నేరంగా
అంతరంగానికి బహిరంగంగా
శిక్ష విధిస్తే?

తప్పుకు శిక్షగా
"మరోతప్పు"లాంటిది చేయడం నిరంకుశమే!

తెలియని ఈ రోజు కళ్ళు మూసినా...
తెలిసే రోజకటి కళ్ళు తెరిపించక తప్పదు.
తెరిచిన కన్నుల్లో నన్ను నేను
చూసుకోక పోతానా? పలకరించకపోతానా?

Posted in September 2020, కవితలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!