Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

3. మీ అంశము నా పంచపది:

ఇక్కడ మరొకరిచే ఇవ్వబడిన అంశము పై పంచపది వ్రాసి తిరిగి మనం ఒక అంశము ఇవ్వాలి...
ఇలా కొనసాగుతుంది ప్రక్రియ.
ప్రక్రియ ఎంతసేపైనా కొనసాగించ వచ్చును. ముగింపు ఇవ్వడానికి సమయ నియమం పెట్టుకోవచ్చును.

ఉదాహరణ -1: ఇచ్చిన అంశం: ధర్మం

ధర్మ మార్గమందే ఎల్లప్పుడూ నడవాలి,
అధర్మ వర్తనమును విడిచి పెట్టాలి,
ధర్మము తప్పక గెలుస్తుందని నమ్మాలి,
సదా ధర్మాన్ని  రక్షించడానికి యత్నించాలి,
మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది సత్యా!

******

నేను ఇచ్చే అంశం: పరిశోధన

ఉదాహరణ – 2: ఇచ్చిన అంశం: వివాహ బంధం

దైవముచే  నిశ్చయమై ఇలలో ఏర్పడే బంధం,
అగ్నిసాక్షిగా స్త్రీపురుషుల మధ్య ఏర్పడే బంధం,
నాతిచరామి ప్రమాణాలతో  ఏర్పడే బంధం,
ఏడడుగులతో ఏడుజన్మలకు ఏర్పడే బంధం,
అపురూపం, అతులితం వివాహ బంధం సత్యా!

*****

నేను ఇచ్చే అంశం: కుమార్తె

పైన ఇవ్వబడిన 2 అంశాలలో: పరిశోధన, కుమార్తె ...ఏదో ఒక దానికి మీ పంచపది వ్రాసి సమీక్ష లో పొందుపరచగలరు.

పంచపది ఉప ప్రక్రియలలో నాలుగవ దానిపై  వచ్చే నెలలో  ముచ్చటించుకుందామా!

*** సశేషం ***

Posted in March 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!