Menu Close
mg
Song

ఎన్నాళ్ళో వేచిన ఉదయం

మానసిక దృఢత్వానికి స్నేహబంధాన్ని మించిన శక్తివంతమైన ఔషధము మరొకటి లేదు. పాత సినిమాలలో స్నేహం యొక్క విలువను ఎంతో హుందాగా భావయుక్తంగా పాటల రూపంలో చిత్రీకరించేవారు. ఆ కోవలోనే 1969 లో విడుదలైన ‘మంచిమిత్రులు’ చిత్రంలో విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇరువురి ఆప్తమిత్రుల మధ్య జరుగతున్న మానసిక సంఘర్షణకు అద్దం పట్టే విధంగా చిత్రీకరించిన ఈ పాట ఆనాడు ఎంతో ప్రాచుర్యం పొందింది. అది కూడా ఘంటసాల గారితో మన బాలు గారు కలిసి పంచుకొన్న ఆ పాట ఈ నూతన ఆంగ్ల సంవత్సర శుభసందర్భంగా మీకు అందిస్తున్నాము.

movie

మంచి మిత్రులు (1969)

music

సి. నారాయణ రెడ్డి

music

కోదండపాణి

microphone

ఘంటసాల, SP బాలసుబ్రహ్మణ్యం


పల్లవి:
ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం... ఈనాడే ఎదురౌతుంటే
ఇన్నినాళ్ళు దాచిన హృదయం... ఎగిసి ఎగిసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

చరణం 1:
మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని
మంచిని పెంచిన మనిషిని... ఏ వంచన ఏమీ చేయదని
నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదనీ
నీతికి నిలబడు వానికి... ఏ నాటికి ఓటమి లేదని
నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలనివస్తే

ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

చరణం 2 :
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
నాగులు తిరిగే కోనలో ఏ న్యాయం పనికిరాదని
కత్తిని విసిరేవానిని... ఆ కత్తితోనె గెలవాలని
నేనెరిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే

ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే
ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే

ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పోతుంటే
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి
ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి

Posted in January 2024, పాటలు