దేవుని ఆశ్చర్యం!!
వన వాసివి, కదళీ వన ఘన తాపసివి, ఆ రక్కసి
మొన లదరి,చెదరి,పారెడి,అతులిత బలశాలివి!
వినయివై,రామనామ జపమున మనెడి ధ్యాన శీలివి,
మా నమ్మికలె గాని, నీ కాభరణము లేల గుణాభరణ!
(ii)
శోక విదూర, సీతార్తిహర, షడాహిత సర్వ వశంకర!
లంకాపరిదగ్ధ సర్వభోజ్య! జ్ఞాన్యగ్రగణ్య!శ్రీఆంజనేయా!!
****
విస్తు పోయి చూసె నయ్యో నిచట,వీతరాగి,నిత్యయోగి, మారుతి/
మస్తుగ నగల దిగేసినారు,నాకేలయని,ముక్కున వేలేసి!!
ఎవ్వడీతడు?!
ఉట్టుల దించి పాల్పెరుగుల పంచి, యొలకబోసి
జట్టుకాండ్ర నలరించు స్నేహ వ్రృష్టి బాల క్రృష్ణుడె
మట్టి కుండల పగులగొట్టి నిద్రించు నాడువారి
జుట్టు ముడులేసి జగడముల నవ్వు తుంటరాయె!
శబరి!
అబ్బబ్బ,ఎంతని వేచితిర,రఘురామ
పబ్బమగు ఈ ఘడియకై, నీదు రాకకై!
నిబ్బరముగ రాలుదుర నిక, ధన్యన
ఇభ్భంగి శ్రీహరి కన్నమిడిన, పుణ్యనై!
హోలీ!!
స్నేహపు తావుల నెయ్యపు పల్కరింత,పరియాచక మింత!
ఆహా యనగ జేయు రంగులతో, పుడమిపై ఇంద్రధనుస్సు!
సౌహార్ద శుభాశయముల వెదజల్లెడి ఓ చిమ్మన గ్రోవి!
ఈ హోళీ వసంతోత్సవ మందరి బాగందరు కోరు పర్వమే!