చారుకేశి!
చారుకేశి,భావ రత్న వారాశి,భావుక సమ్మోద స్వర రాశి
సరసముల,ఆర్తుల నందముగ నాలపించు,రాగ విశేషి !
పూర్వభాగము నాగఫణి,మిగులు రసాలూరు తోడి యనుట
అరకొర పలుకది,చారు గమక స్వాభిమాన, చారుకేశి!!
నిత్యోద్యోగి!!
ఉదయించు నస్తమించు నెట్టి అలుపు లేక,అనాది యుద్యోగి
ఆదరముగ నీవి జూపు, భువి స్వాస్థ్యానందవర్ష కారణుడై,/
ఏది కాదనని మౌన కర్మ సాక్షి, వీడె సూర్యనారాయణుడు!/
ప్రోదియై మనరె భద్రయోచనల,నన్ని చూచు వాడౌననన్!
కొంటే,ఖర్చే!
అచ్చపు కూరలమ్మి,కూర లమ్మగ తానె
వచ్చె, కొనవలదు, పాపం! తరిగి, పోవు!!
*****
బొమ్మకు కవిత,,కవితకు భాష్యం!
(మామూలుగా, కూరలమ్మి కూరలు అమ్మటానికి వస్తుంది, అందరూ కొంటారు, బుట్ట ఖాళీ అవుతుంది, డబ్బులతో ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ, ఈ కూరలమ్మి, చేయబడ్డదే కూరలతో! కాబట్టి,ఆమె క్షేమం కోసం,"కొనవద్దు", అని హెచ్చరిక! తలా ఒక కూరా కొనేస్తే, ఇంక కూరలమ్మి, తనే ఖాళీ అయిపోతుంది, అసలుకే లేకుండా అని!!)
కర్మకౌశలం!
చేసిన ఆక్రృతిని చేయవు,గీసిన బొమ్మను గీయవు
వాసిగ వాడిన ఆ వర్ణము లనంతము లద్భుతములు!
పేశల సుమముల నుండి, ఫెళఫెళ నురుముల దాక
అశేష విశేష భర రేఖా సౌష్ఠవ శిల్ప చాతురియె!
{ii}
దేవాది దేవ, ఎంతని కీర్తింతు నిను, నీదు కౌశలము
న్నవధు లొల్లని వైవిధ్యపూర్ణ జగత్స్రష్టీ పరికల్పున్!!