కాలా గజ్జా కంకాళమ్మ..
పాడుకున్న పాటలు, తెలిపె ఎన్నో వ్యాధులు
నేర్పే ఎన్నో పాఠాలు నేర్పే ఎన్నో పాఠాలు||
చిన్న నాటి ఆటలు, చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు నేర్పే ఎన్నో పాఠాలు||
కొంగా కొంగా పాలు పొయ్యి...
పాడుకున్న పాటలు, వెర్రితనపు గుర్తులు
చిలిపితనపు చేష్టలు చిలిపితనపు చేష్టలు||
చిన్న నాటి ఆటలు చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు నేర్పే ఎన్నో పాఠాలు||
కర్రబిల్లా ఆటలు, గోలీలతో పోటీలు
మట్టితోటి ఆటలు, మానవత్వపు స్నేహాలు
పెనవేసెను ఎన్నో బంధాలు పెనవేసెను ఎన్నో బంధాలు||
చిన్న నాటి ఆటలు చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు నేర్పే ఎన్నో పాఠాలు||
స్నేహితులు పంచిన అప్పచ్చులు, తిన్న కాకిఎంగిల్లు
ఇంకిపోనీ గుర్తులూ, ఇలలో మధురానుభూతులు
మనసుపై చెరగని ముద్రలు మనసు పై చెరగని ముద్రలు||
చిన్న నాటి ఆటలు చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు నేర్పే ఎన్నో పాఠాలు||
వర్షపునీటిలొ చేసిన కాగితపు పడవలు, తడిసిన మేని హృదయాలు
అమ్మచేతి చివాట్లు నాన్న తోటి గారాలు
మరువలేని జ్ఞాపకాలు మరువలేని జ్ఞాపకాలు||
చిన్న నాటి ఆటలు చిందు లేసే ఆటలు
నేర్పే ఎన్నో పాఠాలు నేర్పే ఎన్నో పాఠాలు||