Menu Close
mg
Song

అదివో అల్లదివో శ్రీహరి వాసము

దక్షిణ భారత ప్రజలకు ఇలవేల్పుగా, ఉత్తర భారతంలో బాలాజీ గా సుపరిచితమై, వెంకటేశ్వరా, ఏడు కొండలవాడా, ఆపద మొక్కుల వాడా అని ప్రస్తుతిస్తూ నిత్యం కొన్ని లక్షల మంది తమ మొక్కులు తీర్చుకునేందుకు ఏడు కొండలు దాటి దర్శించుకునే ఆ కల్కి రూపానికి సరైన గుర్తింపు వచ్చింది ఆయన భక్తులవల్లనే. 16 వ శతాబ్దంలో కారణజన్ముడై ఆ కలియుగ దైవాన్ని నిత్యం స్మరిస్తూ 32 వేల పైచిలుకు కీర్తనలు వ్రాసిన మహా భక్తుడు అన్నమయ్య. ఆయన కీర్తనలు అజరామరమై నేటికీ మనందరికీ ఆ కోనేటి రాయుని నిత్య పూజలతో పాటు భక్తితో పాడుకునేందుకు కూడా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా సంగీత ప్రియులకు, పండితులకు అన్నమయ్య కీర్తనలు ఒక మహా వరమై ఎన్నో రాగాలను పరిచయం చేస్తున్నాయి. అంతటి మహా భక్తుడైన అన్నమయ్య జీవితగాథను ఒక సినిమా గా మలిచి మనకు అందించిన దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారు నిజంగా అభినందనీయులు. అలాగే స్వరకల్పన చేసిన కీరవాణి గారికి, పాడిన మన బాలు గారికి, అన్నమయ్య గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నాగార్జున గారికి కూడా మనఃపూర్వక ధన్యవాదాలు. అన్నమయ్య సినిమాలోని ‘అదివో అల్లదివో..’ పాటను మన సిరిమల్లె ఏడవ వార్షికను పురస్కరించుకొని మీ కోసం అందిస్తున్నాము.

movie

అన్నమయ్య

music

కీరవాణి

microphone

ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం

ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవింద
అదివో..ఓ
గోవింద, గోవింద, గోవింద, గోవింద
గోవింద, గోవింద, గోవింద, గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
||ఏడు కొండల వాడా||

అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వేంకటరమణ సంకట హరణ
వేంకటరమణ సంకట హరణ
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదెచూడుడు అదెమ్రోక్కుడు ఆనంద మయము
అదెచూడుడు అదెమ్రోక్కుడు ఆనంద మయము

||అదివొ||
||ఏడు కొండల||

ఆపద మొక్కులవాడా అనాధ రక్షక గోవింద గోవింద
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో..అదివో
వేంకటరమణ సంకటహరణ
భావింప సకల సంపద రూప మదివో..
పావన ములకెల్ల పావన మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
శ్రీహరి వాసము
వెంకటేశ నమో శ్రీనివాసా నమో
వెంకటేశ నమో శ్రీనివాసా నమో
అదివో అదివో ...అదివో అదివో...

Posted in August 2022, పాటలు