Menu Close
Kadambam Page Title
నేటి మహిళ
“ఉదయశ్రీ” యు.సి.ఓబులేశు గౌడు

మహిళ నేడు అబల కాదు ప్రబల శక్తి
వంటింటి కుందేలన్న నాటి మాటలకు
ఇంటింటా చెల్లుచీటి వ్రాసిచ్చిన ధైర్యశాలి
పరాధీన అన్న హీనహావభావ దృక్కులను
గేలి చేసి బోలు చేసిన ధిక్కార వాణి
అన్నిరంగాలలో ప్రవేశించి పరాక్రమించి
ప్రతిభాపాటవాలు చూపుతున్న యుక్తిశాలి
రోదసికెగసిన పరిశోధనాత్మక మేధోశక్తి
రాజకీయ చతుర రంగంలో ఎత్తులు వేస్తూ
పావులను నేర్పుగా కదిపే అపర చాణక్యశైలి
ఆటపాటలలో పదం మోపిన ప్రతిభాశీలి
కదనరంగంలో కదం తొక్కిన పరాక్రమశాలి
సహనశీలి అవసరమైతే కలకత్తా మహంకాళి
ఆటవస్తువుగా చూస్తే చెంప చెల్లుమనిపిస్తుంది
అధికారం చూపిస్తే కొరడా ఝల్లుమనిపిస్తుంది
ఆదరణకు మధువులూరే ప్రణయభావకావ్యం
చులకన చేస్తే చెలరేగే ప్రళయకాల ప్రభంజనం
చెప్పుతూ పోతే ఆమె చరితకు లేదు ముగింపు
వినుతికెక్కి ఘనతకెక్కెను ఆమెలోని తెగింపు
మహిళాశక్తికిదే నా కవితాంజలి ముక్తాయింపు

మహిళాశక్తికి అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు!!

Posted in March 2023, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *