దశమ అధ్యాయం (“పారా, పశ్యంతి, మధ్యమ, వైఖరి” - అమ్మవారి శ్రీ చక్రవర్ణన)
శ్లోకాలు: 71-81, సహస్రనామాలు: 305-372
చిచ్ఛక్తి స్వరూపిణికి వందనాలు.
పరబ్రహ్మ పదలక్ష్యార్ధాన్ని వ్యక్తం చేయునట్టి దేవికి వందనాలు.
చిదాకార మూర్తి అయిన శ్రీ లలితాదేవికు వందనాలు.
ఆత్మానందంలో లయరూపులైన బ్రహ్మాదులు యొక్క ఆనంద సముదాయం కల దేవికి ప్రణామాలు.
పరా వాగ్రూపిణికి నమస్కారాలు.
ఆత్మజ్ఞాన స్వరూపిణికి ప్రణామాలు.
పశ్యంతీ వాగ్రూపిణికి ప్రణామాలు.
పరమ పూజనీయురాలగు పరదేవతా స్వరూపిణికి వందనాలు.
మధ్యమా వాగ్రూపిణికి వందనాలు.
వైఖరీ వాగ్రూపిణికి ప్రణామాలు.
భక్తుల మానసాలలో హంసికవలె తేజరిల్లు శ్రీలలితకు ప్రణామాలు.
* * * దశమ అధ్యాయం సమాప్తం * * *
ఏకాదశ అధ్యాయం (అమ్మవారి శ్రీ చక్రార్చన మహిమ)
శ్లోకాలు: 82-87, సహస్రనామాలు: 373-400
కామేశ్వరునికి ప్రేమనాడి వంటి మాతకు వందనాలు.
కృతజ్ఞతా స్వరూపిణికి వందనాలు.
కాముడనగా మన్మధుడు అట్టి మన్మధునిచే పూజింపబడిన తల్లికి వందనాలు.
శృంగార రస పరిపూర్ణ రూపిణియగు పరమేశ్వరునికి ప్రణామాలు.
జయమే స్వరూపంగా గల మాతకు ప్రణామాలు.
జాలంధర పీఠంలో తేజరిల్లునట్టి మాతకు ప్రణామాలు.
ఓడ్యాణ పీఠము నిలయంగాకల తల్లికి నమస్కారాలు.
బిందువులు వాస స్థానంగా కల తల్లికి ప్రణామాలు.
రహోయాగంలో సక్రమంగా ఆరాధించబడునట్టి లలితాదేవికి వందనాలు.
జ్ఞానాగ్నియందు ధర్మాధర్మ పుణ్యాపుణ్యములను హోమము చేయగా తృప్తి చెందునట్టి తల్లికి వందనాలు.
శీఘ్రమే- తక్షణమే-ఫలాలను ప్రసాదించునట్టి మాతకు ప్రణామాలు.
యావద్విశ్వానికీ సాక్షిభూతురాలైన మాతకు ప్రణామాలు.
తను సర్వానికీ సాక్షిగా ఉంటుంది. కానీ తనకు ఎట్టి సాక్షిలేదు. అట్టి సాక్షివర్జితకు వందనాలు.
వేదాంగాలైన షడంగ దేవతాయుక్తురాలైన శ్రీ దేవికి వందనాలు.
షడ్గుణాలతో పరిపూర్ణురాలైన పరమేశ్వరికి ప్రణామాలు.