Menu Close
Lalitha-Sahasranamam-PR page title

దశమ అధ్యాయం (“పారా, పశ్యంతి, మధ్యమ, వైఖరి” - అమ్మవారి శ్రీ చక్రవర్ణన)

శ్లోకాలు: 71-81, సహస్రనామాలు: 305-372

334. ఓం విశ్వాధికాయై నమః

విశ్వాధికురాలైన లలితాంబకు ప్రణామాలు.


335. ఓం వేదవేద్యాయై నమః

వేదములచే వేద్యురాలు- అనగా తెలిసికోదగిన తల్లికి వందనాలు.


336. ఓం వింధ్యాచల నివాసిన్యై నమః

వింధ్యాచల పర్వతము నివాసస్థానంగా గల దేవికి ప్రణామాలు.


337. ఓం విధాత్ర్యై నమః

విశ్వాలను ధరించునట్టి జగజ్జననికి ప్రణామాలు.


338. ఓం వేదజనన్యై నమః

వేదాలకు మాతృస్థానీయురాలైన మాతకు ప్రణామాలు.


339. ఓం విష్ణుమాయాయై నమః

వైష్ణమాయా స్వరూపిణికి ప్రణామాలు.


340. ఓం విలాసిన్యై నమః

విలాసినీ రూపాన్ని ధరించిన లలితకు వందనాలు.


341. ఓం క్షేత్రస్వరూపాయై నమః

క్షేత్రమే స్వరూపంగా గల మాతకు వందనాలు.


342. ఓం క్షేత్రేశ్యై నమః

క్షేత్రాలను పాలించు ఏలికకు వందనాలు.


343. ఓం క్షేత్రక్షేత్రజ్ఞ పాలిన్యై నమః

జీవుణ్ణీ, శరీరాన్ని రెండింటినీ పాలించునట్టి తల్లికి ప్రణామాలు.


344. ఓం క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః

వృద్ధిక్షయాలు లేని మాతకు ప్రణామాలు.


345. ఓం క్షేత్రపాల సమర్చితాయై నమః

క్షేత్రపాలునిచే అర్చించబడునట్టి దేవికి ప్రణామాలు.


346. ఓం విజయాయై నమః

విజయమే స్వరూపంగా గల మాతకు ప్రణామాలు.


347. ఓం విమలాయై నమః

తొలగిన అవిద్యా స్వరూపిణికి వందనాలు.


348. ఓం వంద్యాయై నమః

నమస్కరించదగిన మాతకు ప్రణామాలు.


349. ఓం వందారుజనవత్సలాయై నమః

తనకు నమస్కరించునట్టి భక్తులయందు వాత్సల్యమును చూపునట్టి మాతకు ప్రణామాలు.


350. ఓం వాగ్వాదిన్యై నమః

వాగ్వదినీ శక్తికి వందనాలు.


351. ఓం వామకేశ్యై నమః

సుందరమైన కేశాలు కల తల్లికి వందనాలు.


352. ఓం వహ్నిమండలవాసిన్యై నమః

సోమ, సూర్య, అగ్నిమండలాలయందు భాసిల్లునట్టి దేవికి ప్రమాణాలు.


353. ఓం భక్తిమత్కల్పలతికాయై నమః

కల్పలతవలె భక్తుల కోరికలను నెరవేర్చునట్టి మాతకు ప్రణామాలు.


354. ఓం పశుపాశ విమోచన్యై నమః

అజ్ఞానరూప పశువులను అవిద్యారూపపాశాలనుండి విముక్తులను చేయగల మాతకు ప్రణామాలు.


355. ఓం సంహృతాశేష పాషండాయై నమః

వేదరహితమైన ఆధారాలను పాటించువారు పాషాండులు. అట్టి పాషాండులను అందరినీ నాశనం చేయునట్టి తల్లికి వందనాలు.


356. ఓం సదాచార ప్రవర్తికాయై నమః

వేదోక్త సదాచారాలను పాటింపజేయునట్టి పావనమూర్తికి ప్రణామాలు.


357. ఓం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయై నమః

తాపత్రయ రూపాగ్నిచే సంతప్తలైనవారికి వెన్నెలవలె చల్లదనాన్ని కలిగించునట్టి మాతకు వందనాలు.


358. ఓం తరుణ్యై నమః

నిత్య తారుణ్యము ( యౌవ్వనము)గల దేవికి వందనాలు.


359. ఓం తాపసారాధ్యాయై నమః

తాపసోత్తములచే ఆరాధించబడునట్టి దేవికి వందనాలు.


360. ఓం తను మధ్యాయై నమః

కృశించిన మధ్యభాగం అంటే నడుము కల దేవికీ వందనాలు.


361. ఓం తమోపహాయై నమః

అజ్ఞానాంధకారమును నాశనం చేయునట్టి దేవికి ప్రణామాలు.

----సశేషం----

Posted in February 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!