Menu Close
mg
Song

మీరజాలగలడా...

movie

శ్రీకృష్ణ తులాభారం (1966)

music

స్థానం నరసింహారావు

music

పెండ్యాల నాగేశ్వరరావు

microphone

పి. సుశీల

సావిత్రి, జమున, భానుమతి ఇలా ఎందఱో మహిళామణులు మన తెలుగు చలన చిత్ర రంగానికి వన్నె తరగని నట కిరీటాలను తమ స్వయం ప్రతిభతో ధరింపజేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది నాయికలు, నటీమణులు తెలుగు చిత్ర పరిశ్రమలో నిత్యం శ్రమిస్తూ తమ నటనా చాతుర్యంతో మనలను అలరిస్తూనే ఉన్నారు.

ఆహార్యం, అభినయం తో పాటు సమయోచిత నటనా కౌశలం కలిగిన అతి కొద్ది మంది నాయికలలో ఒకరు శ్రీమతి జమున గారు. నాయికగా ఆవిడ నటించిన ఎన్నో ఆణిముత్యాల వంటి చిత్రాలు నేటికీ మనసుకు హత్తుకొని మనలను అలరిస్తూనే ఉన్నాయి. ఆమె నటించిన ఎన్నో చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకొన్నాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ సంచిక సిరిమల్లె లో శ్రీ కృష్ణ తులాభారం చిత్రంలో ఆమె అత్యత్భుతంగా భావగర్భితమైన అభినయం చేసిన ‘మీరజాల గలడా నా యానతి’ పాటను మీకు అందిస్తున్నాము.

పల్లవి:
మీరజాలగలడా…
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 1
నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 2
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి
సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే
నాతోనిక వాదులాడగలడా సత్యాపతి

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి

చరణం: 3
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున..
ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..
మధుర మధుర మురళీగానరసాస్వాదనమున
అధర సుధారస మదినే గ్రోలగ
అధర సుధారస మదినే గ్రోలగ

మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా నా యానతి
వ్రతవిధాన మహిమన్ సత్యాపతి
మీరజాలగలడా…

Posted in February 2023, పాటలు