Menu Close
Lalitha-Sahasranamam-PR page title

దశమ అధ్యాయం (“పారా, పశ్యంతి, మధ్యమ, వైఖరి” - అమ్మవారి శ్రీ చక్రవర్ణన)

శ్లోకాలు: 71-81, సహస్రనామాలు: 305-372

305. ఓం రాజరాజార్చితాయై నమః

రాజరాజు-అంటే కుబేరుడు, మనువు- వీరిచే అర్చించిన దేవికి వందనాలు.


306. ఓం రాజ్ఞ్యై నమః

రాజ్ఞీమ తల్లికి ప్రణామాలు.


307. ఓం రమ్యాయై నమః

సౌందర్యరాశికి వందనాలు.


308. ఓం రాజీవలోచనాయై నమః

పద్మముల వంటి విశాలసుందర నయనాలు కల తల్లికి నమోవాకాలు.


309. ఓం రంజన్యై నమః

భక్తులను రంజింపజేయునట్టి మాతకు ప్రణామాలు.


310. ఓం రమణ్యై నమః

స్త్రీ లలో సర్వోత్కృష్ట స్థానంలో తేజరిల్లునట్టి పరమేశ్వరికి వందనాలు.


311. ఓం రస్యాయై నమః

ఆస్వాదనయోగ్యమగు మహేశ్వరికి వందనాలు.


312. ఓం రణత్కింకిణి మేఖలాయై నమః

కింకిణులు మధురనాదాలు చేయి మెరయునట్టి మొలనూలును ధరించిన మాతకు ప్రణామాలు.


313. ఓం రమ్యాయై నమః

లక్ష్మీ స్వరూపిణియగు లలితా మాతకు ప్రణామాలు.


314. ఓం రాకేందువదనాయై నమః

పూర్ణచంద్రాననకు వందనాలు.


315. ఓం రతిరూపాయై నమః

రతిదేవి స్వరూపాన్ని అధిగమించిన సుందరరూపంగల తల్లికి వందనాలు.


316. ఓం రతిప్రియాయై నమః

రతీదేవికు ప్రియమైన లలితాంబకు వందనాలు.


317. ఓం రక్షాకర్యై నమః

లోకాలకు రక్షణ కలిగించునట్టి మాతకు వందనాలు.


318. ఓం రాక్షసఘ్న్యై నమః

రాక్షసులను అంతం చేయునట్టి దేవికి వందనాలు.


319. ఓం రామాయై నమః

రామారూపిణికి ప్రణామాలు.


320. ఓం రమణలంపటాయై నమః

రమణులచే లంపటయై కోమాంగులచే పరివేష్టితయై క్రీడించు మాతకు నమస్కారాలు.


321. ఓం కామ్యాయై నమః

ముముక్షువులచే, జ్ఞానులచే కోరబడు దేవికి వందనాలు.


322. ఓం కామకలారూపాయై నమః

కామకలా స్వరూపిణికి అంటే కోరదగిన కళయే స్వరూపంగా గల దేవికి వందనాలు.


323. ఓం కదంబ కుసుమ ప్రియాయై నమః

కదంబ పుష్పాలయందు ప్రీతిగల మాతకు ప్రణామాలు.


324. ఓం కల్యాణ్యై నమః

కళ్యాణమయ--అంటే మంగళమయ స్వరూపిణికి ప్రణామాలు.


325. ఓం జగతీకందాయై నమః

జగత్తులకు మూలకందమైన దేవికి వందనాలు.


326. ఓం కరుణారస సాగరాయై నమః

సముద్రం వంటి అపార కరుణకల తల్లికి నమస్కారాలు.


327. ఓం కళావత్యై నమః

సమస్త కళలు గల లలితాంబకు వందనాలు.


328. ఓం కళాలాపాయై నమః

కలభాషిణికి--మధురంగా ఆలపించునట్టి తల్లికి వందనాలు.


329. ఓం కాంతాయ నమః

మనోహర కాంతా స్వరూపిణికి వందనాలు.


330. ఓం కాదంబరీ ప్రియాయై నమః

కాదంబరి యందు ప్రియముకల దేవికి వందనాలు.


331. ఓం వరదాయై నమః

వరములు ప్రసాదించునట్టి తల్లికి ప్రణామాలు.


332. ఓం వామనయనాయై నమః

సుందరమైన నయనాలు కల దేవికి వందనాలు.


333. ఓం వారుణీమదవిహ్వలాయై నమః

వారుణిని పాపం చేసి ఆ మదంచే విహ్వలమైన జగజ్జననికి వందనాలు.

----సశేషం----

Posted in January 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!