Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

పంచపది లోని ఉప ప్రక్రియలు ఒక్కొక్కదాన్ని గురించి వివరంగా......

  1. మీ పదములు నా పంచపది: ఇందులో ఒకరు 5 పదములు ఇస్తారు. ఆ పాదాలలో ప్రతి ఒక పదమును ఒక పాదములో ఉపయోగించి, పంచపది నియమాలను పాటించి మనం పంచపది వ్రాయాలి.
  2. తరువాత మనం 5 పదాలను ఇస్తే వేరేవారు వ్రాస్తారు.......ఇలా ఈ శృంఖల కొనసాగుతుంది.

ఉదా 1.

ఇచ్చిన పదములు: మంచి, చెడు, మోసం, ప్రేమ, దయ

************
పై పదములను ఉపయోగించి వ్రాసిన పంచపది దిగువన.....
************

అందరికీ మంచి చేయాలి, మంచికై నిలబడాలి,
మనుషులు చెడును వదలాలి, ఖండించాలి,
మోసగాళ్ళ జిత్తులు మోసంతోనే చిత్తు చేయాలి,
పరస్పరం స్నేహంగా మెలగాలి, ప్రేమను పంచాలి,
పేదవారి యెడల దయ కలిగి ఉండాలి సత్యా!

&&&&&

తదుపరి వ్రాసే వారికై పదములు: రుణం, రణం, అరణం, భరణం, ఆభరణం

ఉదా 2.

ఇచ్చిన పదాలు..మోక్షము, మూర్ఖుడు, బొట్టు, భూమి, కన్ను

ఉదయ భానుడు భూమి నుదుటన బొట్టయ్యేను,
పున్నమి చంద్రుడు భూమి సిగలో పువ్వయ్యేను,
తాపసులను సైతమా దృశ్యము మైమరపించెను,
మూర్ఖుడికి ఆ అందము గ్రహింపు రాకుండెను,
దేవుని సృష్టి  బహు విచిత్రము ఊహాతీతమూ సత్యా!

&&&&&&

నేను ఇచ్చే పదాలు...ప్రయాణం, జీవితం, గమ్యం, సుఖము, దుఃఖము

.........................

పైన ఇచ్చిన 2 ఉదాహరణలలో ఏదైనా ఒకటి తీసుకుని ఆసక్తి ఉన్నవారు/నేర్చుకో దలచిన వారు పంచపది వ్రాసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయగలరు.

*** సశేషం ***

Posted in January 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!