Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

పంచపది లోని రెండవ ఉప ప్రక్రియ గురించి వివరంగా......

మీ పాదము నా పంచపది : ఇక్కడ ఒకరు ఒక పాదము ఇస్తే దానినే మొదటి పాదముగా చేసి మనము పంచపది వ్రాసి తిరిగి మనం ఒక పాదము ఇవ్వాలి...ఇలా కొనసాగుతుంది ప్రక్రియ. ఇందులో ఒక సమయ నియమం పెట్టుకోవచ్చును.

ఉదాహరణకు కొన్ని :

1. ఇచ్చిన పాదం : ఏ భువనమ్ములందు లేడు రాముడంటి పురుషుడు,

దీనిని మొదటి పాదముగ తీసుకుని నేను వ్రాసిన పంచపది దిగువన:

**ఏ లోకముల లేడు రాముడంటి పురుషుడు,
ఏ తండ్రికిని లేడు రాముడంటి కొమరుడు,
ఏ మగువకును  లేడు రాముడంటి మగడు,
ఏ యుగమందు లేడు రాముడంటి దేవుడు,
శ్రీరామచంద్రుని కొలిచి తరించుదాము సత్యా!**

2. ఇచ్చిన పాదము : సామాజిక సేవాభావం పెంపొందించు కోవాలి,

దీనిని మొదటి పాదముగా తీసుకుని నేను వ్రాసిన పంచపది : దిగువన

**సామాజిక సేవాభావం పెంపొందించు కోవాలి,
ఆపదలో ఉన్నవారిని  ఆదుకోవాలి,
పేదవారికి చేతనైన సహాయం  చేయాలి,
అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించాలి,
సమాజ హితమే దేశ హితము సత్యా!**

*****

ఇక్కడ ఒక పాదము ఇస్తున్నాను. ఎవరైనా సరే అది మొదటి పాదముగా తీసుకుని , పంచపదుల నియమాలు పాటిస్తూ, పంచపది, కామెంట్స్ బాక్స్ లో వ్రాయగలరు :

**పరుల సొమ్ము ఆశించి పాపము పొందకుము**

తప్పక ప్రయత్నిస్తారు కదూ!

పంచపదుల మూడవ ఉప ప్రక్రియతో వచ్చే నెల కలుద్దాము!

*** సశేషం ***

Posted in February 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!