Menu Close
mg
- మధు బుడమగుంట -
Song

ఊరు పల్లెటూరు

మనుషుల మధ్యన మానవ అనుబంధ ఆప్యాయతల అనురాగ ప్రేమ పూరిత, స్వచ్ఛమైన పలకరింపులు మృగ్యమై పోతున్న నేటి సమాజ జీవన శైలిలో అప్పుడప్పుడు కొన్ని చిత్రాలు మంచి సందేశాత్మక వాస్తవ జీవన ధర్మాలను వూటంకిస్తూ వస్తుంటాయి. వాటిలో నాటి జనజీవన స్థితిగతులు, ఊరి ప్రజల మధ్యన ఉంటున్న మైత్రి బంధాల మధురిమలను చూపిస్తూ మంచి విలువలను గూర్చి చెప్పడం జరుగుతుంది. తద్వారా మనిషి ఆనందానికి, ఆరోగ్యానికి సరైన మార్గం విశదీకరించడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి కోవలో విడుదలైన ‘బలగం’ సినిమా ఎంతో మంది వీక్షకులను ఆకట్టుకుని మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రం లోని ‘ఊరు పల్లెటూరు దీనితీరే అమ్మ తీరు’ అనే పాటను, చక్కటి పల్లెటూరి మట్టి సువాసనల నిస్వార్థ మనుషుల మధ్యన ఉన్న సహజమైన ప్రేమానుభావాలను చిత్రీకరిస్తూ, హృదయాన్ని తడుముతూ సాగే చక్కటి తెలంగాణా మాండలీకంలో ఎంతో హృద్యంగా అందించారు దర్శకులు వేణు. ఆ పాటను ఈ క్రోధి నామ సంవత్సర సందర్భంగా మీకు అందిస్తున్నాము.

movie

బలగం (2023)

music

శ్యాం కాసర్ల

music

భీమ్స్

microphone

మంగ్లీ, రాం మిర్యాల

ఓర్ వారి ఇంక పిండుతున్నావ్రా పాలు
ఇగెప్పుడు పోతవ్రా ఊల్లెకు నీ యక్క
ఇగ పొద్దు పొద్దున్నే మొదలుపెట్నావయా
నీ పాసుగాల

కోలో నా పల్లె కోడి కూతల్లే
ఒల్లిరుసుకుందే కోడె ల్యాగల్లే
యాప పుల్లల చేదు నమిలిందే
రామ రామ రామ రామ

తలకు పోసుకుందె నా నేల తల్లే
అలికి పూసుకుందె ముగ్గు సుక్కల్నే
సద్ది మూటల్నే సగ బెట్టుకుందే
బాయి గిరక నా పల్లే

హే తెల్ల తెల్లాని పాలధార లల్ల
పల్లె తెల్లారుతుంటదిరా
గుళ్లోని గంటలు కాడెడ్ల మెడలోన
జంటగ మోగుత ఉంటయిరా

నాగలి భుజాన పెట్టూకుంటే
దోస్తులు చెయ్యేసినట్టేరా
గొడ్డు గోదా పక్కన ఉంటే
కొండంత బలగం ఉన్నట్టురా

సల్లగాలి మోసుకొచ్చెరా
సేను సిల్కల ముచ్చట్లు
దారి పొడుగు సెట్ల కొమ్మల
రాలుతున్న పూల చప్పట్లు

గడ్డి మోపులు కాల్వ గట్టులు
సెమట సుక్కల్లో తడిసిన
ఈ మట్టి గంధాల

ఊరు పల్లెటూరు
దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి
కొడుకుకిచ్చె ప్రేమ వేరు

ఊరు పల్లెటూరు
దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు

వంద గడపల మంద నా పల్లె
గోడ కట్టని గూడు నా పల్లె
సెరువుల్ల తుల్లేటి జెల్ల శాపోలే
రామ రామ రామ రామ

మావ అత్త బావ బాపు వరసల్లే
ఊరంత సుట్టాల ముల్లె నా పల్లె
దారంలో ఒదిగిన పూల దండల్లే
రంగుల సింగిడి పల్లే

ఆలు మొగలు ఆడే ఆటలు
అత్త కోడండ్ల కొట్లాటలు
సదిరి సెప్పలేని మొగని తిప్పలే తిప్పలు

రచ్చబండ మీద ఆటలు
చాయబండి కాడ మాటలు
వొచ్చే పొయ్యేటోల్ల మందలిచ్చుకునే
సంగతే గమ్మతి

తట్ట బుట్టలల్ల కూర తొక్కులు
సుట్ట బట్టలల్ల బీడి కట్టలు
చేతనైన సాయం జేసే మనుషులు
మావి పూత కాసినట్టే మనుసులు
ఊరంటే రోజు ఉగాది
సచ్చేదాకా ఉంటది యాది

ఊరు నా ఊరు
దీని తీరే అమ్మ తీరు
కొంగులోన దాసిపెట్టి
కొడుకుకిచ్చె ప్రేమ వేరు

ఊరు పల్లెటూరు
దీని తీరే కన్నకూతురు
కండ్ల ముందే ఎదుగుతున్న
సంబరాల పంటపైరు

Posted in April 2024, పాటలు