Menu Close
Kadambam Page Title
ఉనికి ...!!
డా. కె.ఎల్.వి. ప్రసాద్

ఊరు కి
వెళ్దామని ఉంది!

నేను పుట్టిపెరిగిన
వూరినొకసారి
చూసిరావాలని ఉంది!

పల్లెటూరి
ప్రకృతి శోభను
తనివితీరా...
ఆస్వాదించి -
రావాలని ఉంది!

పంటకాలువలో
స్నానం చేసి
పంటచేను గట్టుమీద
అరిటాకులో ...
భోజనం-
చేయాలని ఉంది!

లంక ఒడ్డు ....
గోదావరిలో
లాంచి ఆగమనం
చూడాలనివుంది!

సంక్రాంతి కాలంలో
ఇళ్లముందు
పల్లెపడుచులు పెట్టే
అందమైన ముగ్గులు
చూడాలని ఉంది!

కోడిపందాలు ...
నాటకాలు
రికార్డింగు డాన్సులు
గంగిరెద్దుల విన్యాసాలు
చూసి ...
బాల్యాన్ని
మరోసారి
బహురూపాల్లో
చూడాలని ఉంది!

కోర్కెలు ....
గుర్రాలై
పరిగెడుతున్నాయి.
కానీ—ఇంతకీ
పల్లెటూళ్ళు --
పల్లెటూళ్లలా
వున్నాయంటారా!

అప్పటి -
నా ..జ్ఞాపకాలు
ఇప్పుడు .....
మళ్లీ ----
గుర్తుకొస్తాయంటారా!!

Posted in January 2021, కవితలు

17 Comments

  1. డి.వి.శేషాచార్య

    అబ్బ! అలనాటి పల్లెటూరు ను అద్భుతంగా ఆవిష్కరించారు. కాని పల్లె కన్నీరు పెడుతుందన్న పాట చెవుల్లో మారుమోగుతోంది సర్.

  2. Jhansi koppisetty

    బావుంది… కాకపోతే మీరు చెప్పిన వాతావరణాన్ని ఊహించుకోవటం వరకేనేమో😊😊😊

  3. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గతం ఎప్పుడూ గొప్పదే. తిరిగి రాదు. కానీ, మన జ్ఞాపకాల చిక్కదనాన్ని బట్టీ అది మనలో అలా ఉండిపోతుంది. చాలా మందికి కష్టమే…కానీ…మీలాంటి భావుకులకు ఇబ్బందేమీ ఉండదు. ఏమంటారు…..?

    ——-మారుతీ కిరణ్
    హైదారాబాద్.

  4. Sagar

    నిజమే సర్ . మారిన పల్లెటూళ్ళకు మీ అక్షరీకరణ అధ్భుతం.మీకు అభినందనలు.

  5. D.Nagajyothi

    మీ మధుర జ్ఞాపకాలు పల్లె నొదిలిన ప్రతి వారి హృదయ దర్పణాలు సర్…బావుంది కవిత

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!