Menu Close
Kadambam Page Title
వెన్నెల హేల
సౌందర్య కావటూరు

దోబూచులేలనే వెన్నెలమ్మా
మా చల్లని మామ పై అలుకేలనమ్మ
జగమంత నిదురించే నడి రాతిరి డోల
వనమంతా నినదించే చిరుగాలి జోల
యీ చల్లని వేళా
దోబుచులేలనే వెన్నెలమ్మా

మా చల్లని మామ పై అలుకేలనమ్మ
మరుమల్లెలు విరిసేటి తొలి జాముల వేళా
మంచు జల్లు కురిసేటి మలిజాముల హేలా
యీ చల్లని వేళా
దోబుచులేలనే వెన్నెలమ్మా

మా చల్లని మామ పై అలుకేలనమ్మ
చకోరములు వేచి చూచే చందురుని రాకక్యే
కలువ పూలు కలత చెందే శశి కిరణం సోకక
యీ చల్లని వేళా
దోబుచులేలనే వెన్నెలమ్మా
మా చల్లని మామ పై అలుకేలనమ్మ

Posted in March 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *