Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
ఈశావ్యాస్యోపనిషత్తు

గత సంచిక తరువాయి... »

ఎనిమిదవ మంత్రం

స పర్యగాచ్ఛుక్రమకాయమవ్రణమ్
అస్నావిరగ్ం శుద్ధమపాపవిద్ధమ్
కవిర్మనీషీ పరిభూః స్వయంభూర్
యథాతథ్యతోteneloluku-letterర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః

భావం: ఎవరు అజ్ఞానంతో కూడిన కర్మలలో (పనులలో) పాల్గొంటారో వారు మిక్కిలి చిమ్మ చీకటి అజ్ఞాన లోకంలో మ్రగ్గిపోతారు. అర్హత లేని కేవలమైన జ్ఞానంలో నిమగ్నమై ఉండేవారు అంతకంటే ఎక్కువ చీకటి లోకంలో మునిగిపోతారు (బాధలు అనుభవిస్తారు).

భాష్యం: కర్మలు లేకుండా జీవితం కొనసాగదు. దైనందిన కర్తవ్యాలు, జపం, తపం సేవ లాంటి ఎన్నెన్నో పనులతో మన జీవితం పెనవేసుకొని ఉంది. ఉన్నత లక్ష్యాలను అంటి పెట్టుకోకుండా ఊరకనే పనులు చేసుకుంటూ పోవడంలో భగవంతుని మార్గంలో పురోగమించడం సాధ్యం కాదు. భగవత్ అనుభూతిని పొందలేము. అర్హత కలాగడానికి ముందుగానే కర్మలను త్యజించి, ధ్యానంలో మునిగిపోవడం ఒక వృధా ప్రయత్నం అవుతుంది. అందువలన ఇవి రెండు జీవితంలో పెనవేసుకుపోవాలి. అవిద్య అంటే అజ్ఞానం లేక అవివేకం నిస్సo దేహంగా హానికరమైనది. కనుక విజ్ఞానాన్ని, విద్యను తప్పుగా గ్రహించబడితే లేక పెడ ద్రోవ పట్టినప్పుడు అది అంతకంటే మరీ హానికరం. ఎందుకంటే జీవితంలో ముఖ్య భాగమైన ఆధ్యాత్మిక అంశాన్ని విడిచి భౌతిక అభ్యుదయానికి నేడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే పరమార్ధాన్ని వదిలి పదార్థం వైపు పరిగెడుతున్నారు. ఇలా భౌతిక పదార్థాల కోసం మనిషి ఎంత తాపత్రయపడితే అంత అంధకారంలో పడిపోతాడు అని ఈ మంత్రం అర్థం.

తొమ్మిదవ మంత్రం

అంధం తమః ప్రవిశన్తి యేteneloluku-letterవిద్యాముపాసతే
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాగ్ం రతాః

భావం: విద్యాసాధన వలన ఒక రకమైన ఫలితం, అవిద్యాసాధన వలన మరొకరకమైన ఫలితం పొందబడుతుందని మహాత్ములు వివరించారు.

భాష్యం: మానవుడు తాను నేర్చుకునే విద్య వలన అతని జీవితం ఆధారపడి ఉంటుంది. అతను సవిద్యను పొందినట్లయితే మంచి ఫలితాలను పొందుతాడు. కువిద్యను పొందినట్లయితే చెడు ఫలితాలను పొందుతాడు.
అంటే నేడు విద్యాలయాలలో కేవలం భౌతిక పరమైన విషయాలను మాత్రమే వివరిస్తున్నారు. అభౌతికమైన ఆధ్యాత్మిక విషయాలను బోధించడం లేదు. అందువలన మనుషులలో శాంతి, సహనం, మమత, మానవతా కరువైపోయాయి. కనుక మనిషి యొక్క జీవితము అతను ఆర్జించే జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని పండితులైన మహానుభావులు తెలియజేశారు.

**** సశేషం ****

Posted in March 2024, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!