Menu Close

కదంబం - సాహిత్యకుసుమం

తీర్పును శాసించే సాక్ష్యాలే
- శ్రీ సాహితి -

మనసు విరిగి అతుకున్న చోటనే
నిజం చిగురు వేసెటప్పుడు

మనిషి విరిగే చప్పుడు
ఎవరికి వినిపించదు.

ముఖంపై గుర్తుపట్టలేనంత
భయం గీసిన బాధ గీతలు

కాలుతున్న రాత్రి వెలుగులో
కసిగా చదివి కన్నీటితో చెరిపాక

కాలం విశాలంగా
కురిసే సంతోషానికి

మనిషి వటవృక్షంగా మారి
నిజాన్ని , నీడను బోధిస్తాడు.

లోతుగా ఆలోచిస్తే
ఒక్కో నిమిషంలో ఎత్తుగా కనిపించే

విరిగిన వాక్యాలు, చితికిన పదాలు
పగిలిన అర్థాలు, చిట్లిన భావాలు

అన్నీ ఆహ్వానించదగ్గ నేస్తాలే
రేపటి తీర్పును శాసించే సాక్ష్యలే.

Posted in June 2026, సాహిత్యం

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *