Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు
శంకర భజగోవింద నాదం

తేటగీతి.
వ్యాకరణ పండితుడొకని వాక్కులు విని
వ్యాకరణము వలన నీకు లోక రీతి
తెలియదు తెలుసుకోవలె తెలివిడి గను
డనుచు తత్వరీతిని యంతరాత్మ వెలుగ

శంకర భగవత్పాదులు శంక దీర్చ
చెప్పె పండ్రెండు మంజరు లొప్ప జనులు
జ్ఞానులై భవబంధాల జాగృతవ్వ
శంకర భజగోవింద మే శరణు మనకు

శంకర భజగోవిందమే సతము వినుము
భౌతికములన్ని నశియించు నాత్మ నిలుచు
చివర చనిపోగ నీతోడ సిరులు రావు
మూఢ మతి పరమాత్మయే తోడు నీకు

డబ్బు డబ్బను పేరాశ జబ్బు తెచ్చు
తృప్తి యున్నటి జన్మమే తృష్టి నిచ్చు
ధర్మమా చరించిన శాంతి దమము కలుగు
యేది నీ ఫలమో నదే నిలను దక్కు

పడతి నందాలు జూసి న ఫలిత మేమి
మాటిమాటికీ తలచిన మనసు చెడును
రక్తమాంసాల ముద్ద ముక్తి గాదు
తోలు తిత్తి గదర మేను తుదకు తుస్సు

Posted in September 2020, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!