Menu Close
Kadambam Page Title
రైలు : కంద పద్యాలు
సత్యవతి దినవహి
1.
చిదగొదలెంచని తేరిది,
ఖిదిరుని ధనికుని సమముగ ఖేటము చేర్చున్,
కదలును అందర తోడ్కొని
ఇదియే ప్రియమగు శకటము ఎల్లజనులకున్.
2.
ఆగును అత్యవసరమున
సాగదు చోదకుడు లేక శకట పయనమే
ఆగక పగలూ రాతిరి
సాగును మక్కెర గమనము శరవేగమునన్.
3.
ముదమిడు నిందున పయనము
చెదరని మేధకు తెలివిడి చేతనమందున్,
సదుపాయమైన జలలిది
ఉత్తమయుగ్గడమిదిమరి ఉర్వరమందున్
Posted in March 2022, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!