పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
పంచపది ఉపప్రక్రియలు;
5 : మీ చిత్రం నా పంచపది
6 : నా చిత్రం నా పంచపది ... గురించి స వివరముగా!
- మీ చిత్రము నా పంచపది : ఇక్కడ ఒకరు ఏదైనా ఒక చిత్రము ఇస్తే దాని పైన మనము పంచపది వ్రాసి తిరిగి మనం ఒక చిత్రము ఇవ్వాలి...ఇలా కొన సాగుతుంది ప్రక్రియ. ఇందులో ఒక సమయ నియమం పెట్టుకోవచ్చును.
భక్త జన రక్షకుడు, ఆపద మ్రొక్కులవాడు,
అభీష్ట వర ప్రదాయకుడు వేంకటేశ్వరుడు,
భక్త జన పాలకుడు పద్మావతీ వల్లభుడు,
శరణాగత వత్సలుడు తిరుమల నాథుడు,
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడే సత్యా!
- నా చిత్రము నా పంచపది : ఇక్కడ మనమే ఒక చిత్రము ఎంచుకొని దానిపై పంచపది వ్రాయాలి.
రంగు రంగుల పుష్పముల మనోహర దృశ్యము,
కాంచిన హృదయమాయే భావ రాగ రంజితము,
ప్రకృతి శోభను ఇనుమడించె విరుల వనము,
వన సౌందర్యానికి పరవశములో జనము,
కన్నుల పండుగ చేసేను ప్రకృతి అందాలు సత్యా!
మువ్వన్నెల పతాక గృహాన ఎగురవేసేను,
గర్వముతో, సంతోషముతో మనసే ఉప్పొంగేను,
అమరవీరుల త్యాగనిరతిని స్మరించేను,
స్వాతంత్ర్య యోధులకు శ్రద్ధాంజలి అర్పించేను,
స్వరాజ్య రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపే సత్యా!
మళ్ళీ సారి బాల పంచపదుల గురించి తెలుసుకుందాము!
*******
దిగువ చిత్రానికి పంచపదులు వ్రాయడనికి ప్రయత్నించగలరు.