ఆలాపన
“ఓ మనిషీ”
ఓ మనిషీ
ఏం చేస్తున్నావ్
ఆ గుడి మూలాల
ఆ చీకటి తావుల
ఇరుకు గదుల్లో
ఎందుకు జపాలు, పురాణాలు?
చీకటి గోడలలో
ఎలా! నీ వేద సారాలు, పూజా పునస్కారాలు
ఒంటరిగా
బిక్కు బిక్కున ఎవరిని పూజిస్తున్నావ్?
భయం భయంగా
ఎవరికోసం తపిస్తున్నావ్?
ఓ సారి కళ్ళు తెరిచి చూడు
నీ దేవుడు నీ ఎదుటనే లేడు
ఈ సువిశాల జగతిలో
ప్రేమతో పరికించు
ప్రతి పనిలో, వనిలో, గనిలో
ప్రతి అణువున, ప్రతి మనిషిన
ప్రతి పదమున, ప్రతి జీవమున
కలడోయీ నీ దేవుడు
నీ మడి బట్టలు అవతల పెట్టు
నీ మోక్షమన్నది కట్టిపెట్టు
పరలోకమన్నది పాతిపెట్టు
జనంలోని రా....
జగంలోకి రా....
నేలమీదికి రా....
నిజంలోకి రా....
మనిషివి మలినమైనా పరవాలేదు
నీ మనసును మలినం కానీయకు
నీ చుట్టూరా ఉన్నది అనంత జీవం
ప్రేమన్నదే దానికి ప్రతి రూపం
ఆ ప్రేమను పంచడం దైవత్వం