లాలలలాల.... లాలలలాల.... లాలలాలాలా....
లలలాలా లలలాలా లల లాలాలాలాలా
నువ్వునేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వునన్ను ప్రేమించావని నేన్నిన్ను ప్రేమించానని తెలిసాకా....
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం... ||నువ్వు||
ఎగరేసిన గాలిపటాలే ఎదలోతుకు చేరుతాయని
రుచిచూసిన కాకిఎంగిళ్ళే అభిరుచులను కలుపుతాయని
తెగతిరిగిన కాలవగట్లే కధ మలుపులు తిప్పుతాయని
మనమాడిన గుజ్జనగూళ్లే ఒకగూటికి చేర్చుతాయని
లాలించి పెంచినవాడే ఇకపై నను పరిపాలిస్తాడని తెలిసాకా....
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం ||నువ్వు||
ఆ బడిలో పాఠాలే మన ప్రేమని దిద్దుతాయని
ఆ రైలు పట్టాలే పల్లకిని పంపుతాయనీ...
రాళ్లల్లో మన పేర్లే శుభలేఖలు చూపుతాయనీ...
ఆ బొమ్మల పెళ్లిల్లే ఆ శీస్సులు తెలుపుతాయనీ...
తనకై నే నేర్చిన నడకలు ఏడడుగులుగా ఎదిగొస్తాయనీ తెలశాకా...
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం ||నువ్వు||