నిర్లిప్తత నిన్నావరించినప్పుడు...
నిశ్శబ్దం నిన్నిష్టపడుతుంది.
నిరాశ నిన్నావహించినప్పుడు
నిర్లక్ష్యం నిన్ను కట్టి పడేస్తుంది.
స్వేచ్ఛ తనస్వేచ్ఛను కోల్పోతుంది.
హృదయం తన విశాలత్వాన్ని కుంచించుకుంటుంది.
ఆలోచన తన వికాసాన్ని కోల్పోతుంది.
వివేకం వెలవెలపోతుంది.
కరుణ కరుడుకట్టుకు పోతుంది.
ఆమైకంలో నువ్వుసూర్య చంద్రుల్ని వెలివేస్తావు.
దిక్కులు తమ హక్కులను కోల్పోతాయి
సమయం అయోమయంతో సతమతమౌతుంది.
కాలం తన గాలంతో నీహృదయాన్ని బంధిస్తుంది.
అశాంతిపవనాలు నిన్ను చుట్టుముట్టి
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
నీ ఊహలు ఉస్సూరంటూ కూలబడతాయి.
నీ ఆశలు ఆవిరౌతాయి.
లోకమంతా నీకు శూన్యమైనట్లు అనిపిస్తుంది.
శోకమంతా నీ పరమైనట్లు కనిపిస్తుంది.
నీకనులు కలలను, నిదురను వెలివేసి
కలతను తమలో నింపుకుంటాయి.
నీ ఊపిరి నీకు బరువవుతుంది.
ప్రశాంతతే నీకు కరువౌతుంది.
చివరకు, నీ కలిమి, బలిమి, కూడా నిన్ను ఆదుకోలేవు
ఒక్క మనోధైర్య మానసిక స్థిరత్వం మాత్రం
తప్పక నీకు సరైన దిశానిర్దేశం సూచిస్తుంది
నిన్ను అశాపూరిత వాస్తవలోకం లోకి తీసుకెళుతుంది.
బ్రతుకు బాటకు చిగురులు తొడిగిస్తుంది.
నిర్లిప్తత నిన్నావరించినప్పుడు...
Posted in March 2024, కవితలు