నీ కన్ను నీలి సముద్రం
మన తెలుగు పాటల ఒరవడిలో ఎన్నో మనసుకు హత్తుకునే మధురభావపూరిత గీతాలను మనం చూడవచ్చు. కొన్ని పాటలు సరళమైన పదాలతో కూడుకొన్ననూ ఇట్టే అందరికీ దగ్గరౌతాయి. కారణం ఆ పాటకు కట్టిన బాణి. ఆ సంగీత స్వరకల్పనలో కొంచెం గజల్ తరహా రాగాలను కూడా ఇరికిస్తే ఆ పాట ఎలావుంటుందో ఇక చెప్పనవసరం లేదు. ఆ పాటకు స్వరం మన సంగీత దర్శకుడు, దేవి శ్రీ ప్రసాద్ బాధ్యతవహిస్తే ఇక అది సూపర్ హిట్ కాక మరేమిటి? ఈ పాటలో ఎన్నో ఉత్ప్రేక్ష అలంకారాలు దట్టించినను ఆ స్వరప్రవాహంలో అవేవి మనకు పట్టవు. ఇందులో కొంచెం హిందీ సాహిత్యం కూడా కలిసింది. ఈ మధ్య కాలంలో వచ్చిన సూపర్ హిట్ పాటలలో ఈ గీతం కూడా చేరుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా ఊరిస్తూ ఉంటే బాగుండదు. ఆ పాటను మీరే వినండి. తెలుగు లిరిక్స్ మాత్రమే ఇక్కడ ఉంచుతున్నాను. హిందీ సాహిత్యం మీరే తెలుసుకోవాలి.
చిత్రం: ఉప్పెన (2020)
సాహిత్యం: హిందీ- రకీబ్ ఆలమ్, తెలుగు- శ్రీమణి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
గానం: జావేద్ అలీ, శ్రీకాంత్ చంద్ర
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నల్లనైన ముంగురులే, ముంగురులే
అల్లరేదో రేపాయిలే, రేపాయిలే
నువ్వు తప్ప నాకింకో
లోకాన్ని లేకుండా కప్పాయిలే...
ఘల్లుమంటే నీ గాజులే నీ గాజులే
జళ్ళుమంది నా ప్రాణమే నా ప్రాణమే
అల్లుకుంది వాన జల్లులా ప్రేమే
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
చిన్ని ఇసుక గూడు కట్టినా
నీ పేరు రాసి పెట్టినా
దాన్ని చెరిపేటి కెరటాలు
పుట్టలేదు తెలుసా ..
ఆ గోరువంక పక్కన
రామ చిలుక ఎంత చక్కన
అంతకంటే చక్కనంట
నువ్వుంటే నా పక్కనా ..
అప్పు అడిగానే ..
కొత్త కొత్త మాటలని
తప్పుకున్నాయే .. భూమి పైన భాషలన్నీ
చెప్పలేమన్న ఏ అక్షరాళ్ళో ప్రేమని
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ కన్ను నీలి సముద్రం
నా మనసేమో అందుట్లో
పడవ ప్రయాణం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నీ నవ్వు ముత్యాల హారం
నన్ను తీరానికి లాగేటి
దారం దారం
నీ అందమంతా ఉప్పెన
నన్ను ముంచినాది చప్పున
ఎంత ముంచేసిన తేలే
బంతిని నేనేనన్నా
చుట్టు ఎంత చప్పుడొచ్చినా
నీ సవ్వడేదో చెప్పనా
ఎంత దాచేసినా నిన్ను
జల్లడేసి పట్టనా...
నీ ఊహలే ఊపిరైన పిచ్చోడినీ
నీ ఊపిరే ప్రాణమైన పిల్లాడినీ
నీ ప్రేమ వలలో చిక్కుకున్న చేపని...