Menu Close
Kadambam Page Title
father-baby
నాన్న
రాయవరపు సరస్వతి

నాన్న మనసు వెన్న,
నాన్న పూజ్యనీయుడు.
కారణం

నన్ను పూలబాటలో నడిపించడం కోసం
తను ముళ్ల బాటలో పయనించాడు.
నా వెన్నంటే ఉండి
నన్నుప్రగతిబాటలోనడిపించిన వాడు నాన్న.

నన్ను పెంచి పెద్ద చేసి
విద్యాబుద్ధులు చెప్పించి,
నా చదువు కోసం రేయింబవళ్ళూ శ్రమించి
నా ఉన్నతికి కారణమైన వాడు నాన్న.

జీవన పథంలో తప్పటడుగులు వేస్తున్న నన్ను
అభివృద్ధి బాటలో నడిపించి
నాణ్యమైన జీవితాన్ని రుచిచూపిన
మహోన్నతుడు నాన్న.

కష్ట సుఖాల్లో వెన్నుతట్టి ఓదార్పుతో
భవసాగర ఒడిదుడుకులను ఓర్పుతో తట్టుకుని
సుఖమయ తీరానికి చేర్చే విధానాన్ని
నేర్పించిన నేర్పరి నాన్న.

జన్మనిచ్చింది అమ్మేఅయినా
ఆ జన్మకు,
మంచి..మానవత్వాల కలబోతతో
సార్ధకత చూపినవాడు నాన్న.

పితృ దినోత్సవ శుభాకాంక్షలు!!!!

Posted in June 2023, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *