Menu Close
Lalitha-Sahasranamam-PR page title

అష్టమ అధ్యాయం (అమ్మవారి విరాడ్రూప మంత్ర, తంత్ర, సగుణ రూప వర్ణన)

శ్లోకాలు: 51/2-60, సహస్రనామాలు: 196-248

226. ఓం మహాతంత్రాయై నమః

అనంత సత్ఫలాలను ప్రసాదించునట్టి మహాతంత్రమూర్తికి నమస్కారాలు.


227. ఓం మహామంత్రాయై నమః

మహత్తర ఫలాలను అనుష్ఠానమాత్రంచే జపించినంత మాత్రాన ప్రసాదించు మహామంత్ర స్వరూపిణికి ప్రణామాలు.


228. ఓం మహాయంత్రాయై నమః

విశాలవిశ్వంలోగల సమస్త మహత్తర యంత్ర స్వరూపిణియై తేజరిల్లు తేజస్స్వరూపిణికి వందనాలు.


229. ఓం మహాసనాయై నమః

మహత్తరమైన- దివ్యమైన ఆసనంగల మాతకు ప్రణామాలు.


230. ఓం మహాయాగ క్రమారాధ్యాయై నమః

శ్రీమాత యొక్క చరణసేవయే మహాయాగము. సక్రమంగా ఆరాధించబడునట్టి చరణారవిందాలుకల జగదంబకు వందనాలు.


231. ఓం మహాభైరవపూజితాయై నమః

పరమేశ్వరునకు మహాభైరవనామమున్నది. అట్టి మహాభైరవునిచే పూజింపబడిన జగన్మాతకు ప్రణామాలు.


232. ఓం మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణ్యై నమః

కల్పాంతవేళలో మహేశ్వరుడు చేయునట్టి ప్రళయతాండవాన్ని తిలకించిన సాక్ష్యీస్వరూపిణికి ప్రణామాలు.


233. ఓం మహాకామేశ మహిష్యై నమః

పరమశివదేవునిపట్ల మహిషియైన మాతకు వందనాలు.


234. ఓం మహాత్రిపుర సుందర్యై నమః

లోకత్రయంలో మహత్తర సౌందర్యాతిశయంతో తేజరిల్లు త్రిపుసుందరీ మాతకు ప్రణామాలు.


235. ఓం చతుషఃష్ట్యుపచారాఢ్యాయై నమః

64 ఉపచారాలచే ఆరాధించబడుచూ శోభిల్లునట్టి మహేశ్వరికి వందనాలు.


236. ఓం చతుఃషష్టికళామయ్యై నమః

చతుషష్టి కళాస్వరూపిణియైన శ్రీ లలితాంబకు వందనాలు.


237. ఓం మహాచతుఃషష్టి కోటియోగినీ గణసేవితాయై నమః

64 కోట్ల మహాయోగనీ గణాలచే సేవించబడునట్టి శ్రీ లలితా పరమేశ్వరికి ప్రణామాలు.


238. ఓం మనువిద్యాయై నమః

మంత్రోద్ధారకులైన శ్రీ విద్యోపాసకులద్వారా అనుష్ఠించబడిన మంత్రాలకు మనువులని పేరు. అట్టి మనువిద్యా స్వరూపిణికి ప్రణామాలు.


239. ఓం చంద్రవిద్యాయై నమః

చంద్రవిద్యా స్వరూపిణియైన శ్రీలలితా మాతకు వందనాలు.


240. ఓం చంద్రమండలమధ్యగాయై నమః

సంపూర్ణ చంద్రబింబ మధ్యభాగంలో శాంతకాంతులతో తేజరిల్లు శ్రీ లలితాదేవికి వందనాలు.


241. ఓం చారురూపాయై నమః

లావణ్యంతో శోభిల్లునట్టి మనోహర సౌందర్యమూర్తికి ప్రణామాలు.


242. ఓం చారుహాసాయై నమః

అందమైన నవ్వుల కల తల్లికి వందనాలు.


243. ఓం చారుచంద్ర కళాధరాయై నమః

జ్ఞానప్రదమైన సుందరతరమై వృద్ధి క్షయాలులేని చంద్రరేఖను ధరించిన పరమేశ్వరికి ప్రణామాలు.


244. ఓం చరాచర జగన్నాథాయై నమః

చరాచర జగధీశ్వరికి వందనాలు.


245. ఓం చక్రరాజ నికేతనాయై నమః

శ్రీచక్రరాజమే నికేతనంగా కల తల్లికి ప్రణామాలు.


246. ఓం పార్వత్యై నమః

పర్వతరాజ పుత్రియగు పార్వతీమాతకు ప్రణామాలు.


247. ఓం పద్మనయనాయై నమః

కమలములవలె సుందరమై సువిశాల నేత్రాలుగల తల్లికి వందనాలు.


248. ఓం పద్మరాగ సమప్రభాయై నమః

పద్మరాగ మణివలె ఎర్రనైన ప్రకాశం కల తల్లికి వందనాలు.


* * * అష్టమ అధ్యాయం సమాప్తం * * *

----సశేషం----

Posted in October 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!