Menu Close
Lalitha-Sahasranamam-PR page title

అష్టమ అధ్యాయం (అమ్మవారి విరాడ్రూప మంత్ర, తంత్ర, సగుణ రూప వర్ణన)

శ్లోకాలు: 51/2-60, సహస్రనామాలు: 196-248

196. ఓం సర్వజ్ఞాయై నమః

సర్వమూ తెలిసిన సర్వజ్ఞమూర్తికి వందనాలు.


197. ఓం సాంద్రకరుణాయై నమః

విశేషకరుణతో భక్తులను అనుగ్రహించునట్టి కరుణామయికి నమస్కారాలు.


198. ఓం సమానాధికవర్జితాయై నమః

సమానత్వాన్నీ, ఆధిపత్యాన్నీ కూడా వర్జించిన తల్లికి వందనాలు.


199. ఓం సర్వశక్తిమయ్యై నమః

శక్తి సర్వస్వ స్వరూపిణికి ప్రణామాలు.


200. ఓం సర్వమంగళాయై నమః

సర్వమంగళ స్వరూపిణియై భక్తులకు సమస్తమైన మంగళాలనూ చేకూర్చునట్టి తల్లికి ప్రణామాలు.


201. ఓం సద్గతిప్రదాయై నమః

సద్గతులను ప్రసాదించునట్టి మాతకు ప్రణామాలు.


202. ఓం సర్వేశ్వర్యై నమః

సర్వమునకూ, నిఖిలవిశ్వాలకూ అధీశ్వరియైన సర్వేశ్వరికి వందనాలు.


203. ఓం సర్వమయ్యై నమః

సర్వమూ నిండి నిబడీకృతమైన సర్వమయీ మాతకు వందనాలు.


204. ఓం సర్వమంత్ర స్వరూపిణ్యై నమః

అనంతకోటి మంత్రాలకు స్వరూపిణియైన తేజరిల్లు శ్రీవిద్యాస్వరూపిణికి వందనాల


205. ఓం సర్వయంత్రాత్మికాయై నమః

యావద్విశ్వంలోనూ కల అద్భుత ఫలప్రదాయకాలైన సమస్త యంత్రాలు స్వరూపంగా కల తల్లికి ప్రణామాలు.


206. ఓం సర్వతంత్ర రూపాయై నమః

సమస్తమైన తంత్రాలూ స్వరూపంగా కల తల్లికి నమస్కారాలు.


207. ఓం మనోన్మన్యై నమః

మనస్సును హృదయంలో - లేదా భ్రూమధ్యభాగంలో నిలిపి ధ్యానించుటకు ‘ఉన్మని’ అని పేరూ అలా ధ్యానించువారికి సిద్ధించునట్టి జ్ఞానామృత స్వరూపిణియైన శ్రీదేవికి వందనాలు.


208. ఓం మహేశ్వర్యై నమః

మహేశ్వరుని ప్రియమైన భార్యయగు మహేశ్వరీ దేవికి వందనాలు.


209. ఓం మహాదేవ్యై నమః

మహత్తరమైన దేవీ స్వరూపిణికీ వందనాలు.


210. ఓం మహాలక్ష్మ్యై నమః

భక్తులకు సమస్త సంపదలనూ ప్రసాదించునట్టి మహాలక్ష్మీ స్వరూపిణికి ప్రణామాలు.


211. ఓం మృడప్రియాయైనమః

ప్రాణికోటికి సుఖాలను ప్రసాదించు పరమశివదేవునికి ‘మృడుడ’ని నామమున్నది. అట్టి మృడుని ప్రియురాలైన దేవికి వందనాలు.


212. ఓం మహారూపాయై నమః

మహత్తరమైన రూపంగల తల్లికి వందనాలు.


213. ఓం మహాపూజ్యాయై నమః

మహత్తర శక్తి సంపన్నులచే మహాత్ములుచే పూజింపబడునట్టి తల్లికి వందనాలు.


214. ఓం మహాపాతకనాశిన్యై నమః

మహాపాతకాలను సైతం నాశనం చేయునట్టి అపారశక్తి స్వరూపిణికి వందనాలు.


215. ఓం మహామాయాయై నమః

ఎంతటి వారినైననూ మహామాయలో పడవేయగలిగిన శక్తి స్వరూపిణికి ప్రణామాలు.


216. ఓం మహాసత్త్వా యై నమః

గుణశీల శక్త్యాదులయందు అత్యధికురాలగు మాతకు ప్రణామాలు.


217. ఓం మహాశక్త్యై నమః

తనను మించిన శక్తి సామర్థ్యాలు కలవారు చతుర్దశ భువనాలలో మరెవరూ లేరు. అట్టి మహాశక్తి స్వరూపిణికి వందనాలు.


218. ఓం మహారత్త్యై నమః

మహత్తరమైన రతిస్వరూపిణికి ప్రణామాలు.


219. ఓం మహాభోగాయై నమః

మహత్తరమైన భోగాలను అనుభవించునదీ, తన భక్తులైనవారికి సర్వభోగాలను ప్రసాదించగలదీ అయిన సర్వేశ్వరికి ప్రణామాలు.


220. ఓం మహైశ్వర్యాయై నమః

మహైశ్వర్యంతో తులతూగుతూ తేజరిల్లునట్టి దేవికి నమస్కారాలు.


221. ఓం మహావీర్యాయై నమః

మహావీరులచే ఆరాధించబడునట్టి మహత్తర వీర్య స్వరూపిణికి వందనాలు.


222. ఓం మహాబలాయై నమః

మహత్తరమైన సైన్యబలాలు శక్తి సైన్యాలు విశేషంగాకల రాజరాజేశ్వరీదేవికి ప్రణామాలు.


223. ఓం మహాబుద్ధ్యై నమః

మహత్తరమైన బుద్ధియే అంటే సర్వజ్ఞతకు స్వరూపంగాగల దేవికి వందనాలు.


224. ఓం మహాసిద్ధ్యై నమః

అణిమ, గరిమ, మహిమాది మహత్తర సిద్ధులను ప్రసాదించునట్టి శ్రీదేవికి వందనాలు.


225. ఓం మహాయోగీశ్వరేశ్వర్యై నమః

మహాయోగులకు కూడా ఈశ్వరి-దేవత అయిన తల్లికి వందనాలు. మహా యోగీశ్వరుడైన పరమశివుని దేవేరి అయిన మాతకు నమస్కారాలు.

----సశేషం----

Posted in September 2022, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!