ఇంటి చూరు చిరచిర లాడుతూ ఉంది,
పైకప్పు పగులుతోంది,
గోడలు ఘొల్లు మంటున్నాయి,
నేల నీరుకారిపోతోంది,
దుప్పట్లు చిరుగుతున్నాయి,
ఇక్కట్లు పెరుగుతున్నాయి,
బొంతలు బెదురుతున్నాయి,
తలగడలు తల్లడిల్లుతున్నాయి,
మంచాలు ముసలివయ్యాయి,
పట్టెడలు పుటుక్కు మంటున్నాయి,
(మంచం)కోళ్ళు కిర్రు కిర్రు మంటున్నాయి,
జేబు డాబు చూపలేక పోతోంది,
ధనం పూర్ణత్వాన్ని ప్రదర్శించలేకపోతోంది,
సమస్యలు సాధిస్తున్నాయి,
వేదనలు వేధిస్తున్నాయి,
భ్రమలు భాధిస్తున్నాయి,
శోకాలు శోధిస్తున్నాయి,
ఆలోచనలు అదిరిస్తున్నాయి,
బాధలు బెదిరిస్తున్నాయి,
ఊహలు ఉసూరంటున్నాయి,
ఆశలు అడుగంటుతున్నాయి,
బాసలు బావురుమంటున్నాయి,
అవసరాలు అల్లాడిస్తున్నాయి,
ఆలోచనలు ఆటలాడుతున్నాయి,
పరితాపాలు పాటపాడుతున్నాయి,
ఆవేదన పురివిప్పుతోంది,
ప్రమోదం దారితప్పుతోంది.
పేదరికపు పరితాపానికి నిష్కృతి లేదు.
ఆకృతి లేని ఈ జీవన వాహిని
నిగ్రహంతో గతిలేక నిరీక్షిస్తున్న
నిత్యజీవిత సత్యం
ఇక్కట్లు