ఏమీ తోచని కాలం
ఒక ఇల్లు
అల్లుకున్న ఇంటర్నెట్ తప్ప
ఏమి తోచని ఇరుకు ప్రపంచం ఇప్పటిది.
రోజులకి తేడా తెలీదు
ఏవీ చిగురించవు
చివరాఖరికి
కదలలేని బంధాలతో
వేరు వేరు గా
కాలం ఒడ్డున కరిగిపోతూ ...
ఆకాశం నేల
రాతిరి పగలు
అన్నీ ఇంటికే అంటుకున్నాయి.
చూపులు స్వేచ్ఛ మీద
వాలాలని చూస్తున్నాయి.
ఎగరలేని పక్షుల్లా పిల్లలు
ఆటలులేని వింత ప్రపంచం లో
చిక్కుకుని
మొబైల్ ఫోన్ మీద వేలాడుతున్నారు.
కిటికీలు తెరవని
ప్రపంచంలో కిటకిటలాడుతూ
ఒక సూర్యోదయాన్ని
ఒక చంద్రోదయాన్ని
ఈ చిన్ని గూటిలో పూయిస్తున్నాం.