Menu Close
mg

దైవం మానవ రూపం లో

మానవ సేవే మాధవ సేవ అంటారు. కారణం ఆ దేవదేవుడు అవసరమైనప్పుడు తనను నమ్మిన వారిని రక్షించుటకు, ధర్మ సంస్థాపన కొరకు మనిషిగానే జన్మించి తను సంకల్పించిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తిచేసి వెళతాడు. యుగ యుగాలుగా మనం అటువంటి మానవ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఎందరినో పూజించాము, దర్శించుకొన్నాము. అందుకే అంటారు సాటి మనిషిని ముందుగా మనం నమ్మాలి, మంచిని పెంచాలి, పదిమందికి ఆ మంచిని పంచాలి. శ్రీషిర్డి సాయిబాబా మహత్యం సినిమా కొరకు శ్రీ రంగస్వామీ పార్థసారథి గారు రచించగా, సంగీత సామ్రాట్టు శ్రీ ఇళయరాజా గారి స్వరకల్పనలో శ్రీమతి సుశీల గారు ఆలపించిన చక్కటి ఆణిముత్యం అయిన ఈ పాటను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షల తో మీకు అందిస్తున్నాము.

పల్లవి :

దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో
దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల...
దీనుల హీనుల పాపుల పతితుల
ఉద్ధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓ..

దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో.....

చరణం 1 :

త్రేతా యుగమున రాముడుగా ద్వాపరమందున కృష్ణుడుగా
త్రేతా యుగమున రాముడుగా ద్వాపరమందున కృష్ణుడుగా
కలిలో ఏసు.. బుద్ధుడు.. అల్లా....కలిలో ఏసు బుద్ధుడు అల్లా
కరుణా మూర్తులుగా ఆ ఆ....ఆ

దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో....

చరణం 2 :

సమతా మమతను చాటుటకై ..సహనం త్యాగం నేర్పుటకై
సమతా మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై
శాంతి స్థాపన చేయుటకై ..శాంతి స్థాపన చేయుటకై
ధర్మం నిలుపుటకై...ఈ......ఈ......ఈ

దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల...
దీనుల హీనుల పాపుల పతితుల
ఉద్ధరించగా యుగయుగాలలో...ఓఓ..ఓఒ..
దైవం మానవ రూపం లో అవతరించునీ లోకంలో

Posted in January 2021, పాటలు