రసావతారుడు!!
పల్లవముల కెవడు నునులేత రంగుల నెన్ని వేయునొ
దళాక్రృతీ సౌష్టవముల నెవడు తీర్చి తీవెలై చాచునొ
పూల లోదారుల వేల పలు వన్నెల నెవడు దిద్దునొ
అళితతి భ్రమయు సుధల విరుల నే దాత నింపునొ
(ii)
పౌష్పిక రస రమ్య లోకము నే రసావతారుడు సంకల్పించి/
ఈషన్మాత్రమున రూపు నిచ్చునో, మ్రొక్కెద వానికి న్సాష్టాంగునై!
జానకీదేవి!!
రాణిగ సింహపీఠి నలంకరించు క్షణమున కానల కేగితివి/
రాణగ పతిని చేరు ఘడియ కణకణల పావకు జొచ్చితివి/
రాణిగ యింత సుఖియించు తరి త్యాజ్యవై ఆటవుల మిగిలితివి/
పూర్ణగ శీలపూర్ణగ వీరసూనుల పతికిచ్చి ధర చేరితివి/
(ii)
మణివమ్మ, భరత వనితా ఘన చరితానర్ఘ శిరోమణివమ్మ/
గుణరత్నసంఘాత సుశ్వేత! ఓ సీత! క్షమాప్రపూత!సత్త్వ నిత్యస్థా!
యశోదా హ్రృది!!
నిన్ళటి యల్లరి తలచి మురిసెదవో ముగ్ధవై యశోద,నీ
వెన్నుడు కను సన్నల సంగడీండ్ర పురిగొలిపి,పాల్వెన్నల
చెన్నారగించు బాలుడటె!తెలియవింత,తా గికురించునెట్లు
యన్నలువ న్సవరించునెట్లయ్యహినిశాసించునెట్లాశక్రున్!!
****
ఇంత నోట విశ్వమంత చూపెనెట్లని తలచి యశోద తనిసె
అంతయు జేసిన అంతమాది లేని అనంతగుణ వైభవుడని
చెంతనుండియెతాచిక్కకబల్వింతగపరీక్షించుప్రాచార్య నిగ
మాంతవిహారి స్రగలంకారి హరి వాడని తెలిసి తెలియకన్!
ఇంటి పుదీనా!
ఇదేనా, బలే!,మీ ఇంటి పుదీనా/
ఉదారంగ పూసి, కాపు కాసేనా?!
సదా ఆదరంగ, నీరాడిస్తేన/
ముదాకరమే వంట,ఇంటిలోన!!