చీరకట్టు
అందమంత చీరలోనే ఉన్నది.
ఆటవెలదులలో ఆడవారి చీరకట్టు.
ఆడవారి నెల్ల. నందమ్ముగా నుంచు
చూడ చూడ మరల సొగసు బెంచు
చీరకట్టు చాలు స్త్రీలు మాలక్ష్ములే
చిన్న డ్రస్సు లొద్దు సెలవు పలుకు.
పట్టు చీర గట్టి పడతి దా సోగసుగా
పసిడి సొమ్ము లెన్నో బాగా దాల్చ
ఆపె వపువు మెరియు రెండింతలుగ చూడ
అందమంత చీర కట్టు నుండె
కాల మహిమ గాదె కాంక్షతో మహిళలు
చీరమాని చిన్న డ్రస్సు లెల్ల
వేలు బోసి కొనుచు వేలము వెర్రిగా
వేసి కోని తిరుగ వెగటు బుట్టు.
అమ్మ లార వినుడు ఆంధ్రుల సొత్తుగా.
ఆది నుండి చీర మెప్పు బడసె.
మన వేష భాష, మన కట్టుబొట్టులు
మనవి గాదె వాని మరవ వద్దు..