Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు
బ్రౌన్.. తెలుగు సూరీడు

అతనొక సాహితీ పిపాసి
హితడైన తెలుగు తాపసి
తెలుగు నుడి గుడిలో
కొలువైన దేవుడు
కొడిగట్టిన తెలుగు దీపం
వెలిగించిన ధీరుడు
ఇంగ్లీషు వాడైతేనేమి
తెలుగు రుచి మరిగిన వాడు
తెలుగు మాగాణి ఆసామి
తెలుగుకు వెలుగులు నింపిన రేడు
మన బడుగు తెలుగు వారి కన్న
వేయిరెట్లు ఓ విదేశీయుడు మిన్న
మరుగుపడిన తెలుగు కవిత్వాలు
ఘనమైన వేమన సుమతీ శతకాలు
వెలికి తీసినవాడు
వెతలు పడిన వాడు
తెలుగు గొప్పదనం
తెలుగు తీయదనం
తెలిసిన దొరవాడు
తెలుగునుడికి సూరీడు
మిణుకు మిణుకుమని
ఆరిపోతున్న తెలుగు సాహితీ దీపాన్ని
తానే వత్తిగా చమురుగా మారి
దేశ దేశాల తెలుగుకు వెలుగులు
తెచ్చిన మహనీయుడు మరో రాయలు
పదవులు బిరుదులు కోరనివాడు
తెలుగుకై జీవితానర్పించిన వాడు
తెలుగుకై అప్పులుజేసి
తిప్పలు పడిన పరదేశి
సొంత ఆస్తులు అర్పించినవాడు
ఎంతోమందిని పోషించిన వాడు
కరువులో గంజి కేంద్రాలు
కష్టాలలో దాన ధర్మాలు
చేసిన దయాహృదయులు
విగ్రహాలు వేదికలు లేని వాడు
తెలుగు పాలకులు మరచిన వాడు
మరువలేని త్యాగధనుడు
తెలుగింటి వర సోదరుడు
అతనికివే ...
తెలుగువారి వేలవేల దండాలు
తెలుగు సూరీడుకు జేజేలు
జై తెలుగుతల్లి
జై జై వెలుగు మళ్ళీ

(డిసెంబర్ 12, సి.పి. బ్రౌన్ వర్ధంతి సందర్భముగా ఈ చిన్ని నివేదన)

Posted in January 2021, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!