గుళ్ళో రాయిగా నిను పెట్టి
గర్భములో గుడికడుతూ
నే సుఖము పొందలేనయ్యా
ఏడుకట్ల పల్లకెక్కి
రంగు రూపు వాసనలేక చీకట్ల అవతలదాగిన నిన్ను చేరి
సేదాదీరాలనుందయ్యా దారిచూపు...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
సాలేపురుగుకన్న సాలేగాణ్ణయ్యా
పాముకన్న పాతకుడినయ్యా
ఏనుగుకన్న ఎర్రిబాగులోడినయ్యా
మరి నా గుండెల్లో మరో శ్రీకాళహస్తి కావా...?
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
నీ గుళ్ళు తిరుగుటకు ధనము లేదు
నిన్ను తెలుసుకునుటకు జ్ఞానరధము లేదు
శ్రీశైల శిఖరముచూసే ఫలములేదు
నా శిరమే శ్రీశైల శిఖరమా
అందున స్మరణే కాశీ క్షేత్రమా
కాయమీదున్న తలకాయ కాలితే ఇక మోక్షమా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
తప్పుల చంద్రుడినే చేరదీస్తివయ్యా
అహమున్న గంగనే నెత్తిన మోస్తివయ్యా
విషమున్న వాసుకినే మెళ్ళో వేస్తివయ్యా
నువ్వు తలుచుకుంటే నేనో లెక్కా...!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
కోట్ల కోట్ల నోట్లు పెట్టెలో దాసి
పైసలున్నాయని పేటేగ్రిపోతరు
ఈ పెట్టెలో నిప్పు ఆరితే నోట్లమన్నేగదయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
అడ్డగాడిదలంత ఏకమై
నువ్వు లేవని అడ్డంగా ఒండ్రబెడుతున్నాయి
ఆ ఒండ్రింపులోనూ ఓంకారమున్నదని వాటికి చెప్పవయ్యా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
దొంగనాకొడుకులంత దోస్తీ చేసి
గుళ్ళోని నిన్ను పెకిలిస్తమని పళ్ళికిలిస్తరు
గుండెల్లో ఉన్న నిన్ను దోచేదెవడురా...
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
కులాల కొమ్ములతో కుమ్ములాడుతరు
ఎవడి దమ్ము ఎంతుందో చూద్దాం రమ్మంటరు
నీ శంఖపు దుమ్ములేవగనే దమ్ము ఆయాసమొచ్చి పడిపోతరు
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
మతాల గూర్చీ మాట్లాడకంటరు
మా మతానికి మించిన మంచిది లేదని చిడతల్ కొడతరు
సృష్టికి సంస్కృతిని నేర్పిన సనాతనమును మించిన సత్యమున్నదా...?
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!
చీకట్లో కూర్చుని
నీ చిద్విలాసము రాస్తినయ్యా
నీవంటేనే వెలుగు
ఇక చీకటెక్కడ ఉంటది..!
నీ ఆటకు నీవె సాటి భళా సదాశివా...!