ఆశల అలలతో
పరుగులు
తీస్తున్న నది
ఆమె
ఆ నది
సంగమంకై
ఆశగా
ఎదురుచూస్తున్న
సముద్రం
అతను
ఆమె నవ్వే
సంతోషపు
వర్షం
ఆ వర్షంతోనే
పండుతుంది
అతడి
జీవితం
దాంపత్యంలో
అతనేమో
వేరు
ఆమెమో
చెట్టు
ఎవరుగొప్పో
ఎలా చెప్పగలము
ఆమె
ఓ సూర్యోదయమే
అతనిలో చీకట్లను
తీసేస్తూ
అతడిని
అస్తమించని సూర్యుని చేసి
తను అస్తమిస్తున్నది
అతడి ఆత్మీయ సంధ్యాతీరంలో
ఆమె
విశాలమైన
సముద్రం
అతనేమో
వెకిలి వేశాలతో
ఎగిసిపడే
అల
ఎన్ని
వెకిలి వేశాలేసిన
తనలో
కలుపుకునే
ఆమె గుణం
ఎంత గొప్పదో
ఆమె
ఓ పచ్చని పైరు
అందరిని
పలుకరించి
ఆత్మీయతను
నింతుంది
అతనేమో
నీరై
ఆ పైరును
పెంచిపోషిస్తాడు
ఎందుకంటే
వారి
దాంపత్యం
ఓ వరిమడి
మరి
అతన్ని
కట్టుకున్న
పుణ్యానికి
పున్నమి చంద్రుడిలా
వెలుగుతున్నది ఆమె
ఆమెను
కట్టుకున్న
పాపానికి
పెంచిపోషిస్తూ
పున్నమి చంద్రుడి
ప్రక్కన
నక్షత్రంలా
మిణుకుమిణుకు
మంటున్నాడు
ఆతను
అన్ని
ఆర్పిస్తూ
అతనే
సర్వస్వం
అనుకుంటున్న
ఆమెను
చూస్తుంటే
ఆశ్చర్యమేస్తుంది
అన్ని
నేనే ననుకుంటూ
ఆమెను
చిత్రహింసలు
పెడుతున్న
అతనిని
చూస్తుంటే
మరి ఆశ్చర్యమేస్తుంది
దీనినే
దాంపత్యమంటున్న
ఆమె
ఓర్పుకు
బహు ఆశ్చర్యమేస్తుంది
నేడు
ఆమె
పక పక
నవ్వుతూ
పరిమళిస్తున్నది
అతను
బురదనీరైన
తనకు
కాస్త
చోటిచ్చాడని
గుడ్ అభి….