Menu Close
Kadambam Page Title
mother and baby
అమ్మ ప్రేమ
సౌందర్య కావటూరు

అమ్మ ప్రేమ అనంతం
అమ్మ మాట అమృతం
అమ్మకరుణ అపారం
అమ్మ అనే భావం అనిర్వచనీయం

తల్లిని మించిన దైవం లేదు
భువిలో వెలసిన మమతల కోవెల అమ్మ
ఇలపై కురిసిన అనురాగ వర్షిణి అమ్మ

మానవాళి మనుగడకి అవలంబం ధరిత్రి
కల్లోల సంసార సాగర జనిత- సుధా తరంగం జనయిత్రి

మహాత్మునికి తల్లి పుతలీ బాయి
పరమాత్మునికే జన్మనిచ్చింది మాతా దేవకీ మాయి

పసి హృదయానికి లయ నేర్పేది అమ్మ లాలిత్యం

అలసిన మనసుకు స్వాంతన నిచ్చేది అమ్మ సాన్నిహిత్యం

పదిమంది బిడ్డల పెంపకంలో పరాకెరుగని తల్లి
ముది వయసున పిల్లల చిరాకుతో తల్లడిల్లేను
చేయరాదు జీవితాన ఏనాడూ అమ్మని నిరాదరం
దివ్య పద మందిన అమ్మ దీవెనలే మనకు నిరతాక్షతం

మాతృమూర్తులకివే జోహార్లు
తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

Posted in May 2023, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *