కృష్ణం వందే జగద్గురుం
ఎవ్వరీతడు?
దేవకీ నందనుడు
రాధికా మోహనుడు,
రుక్మిణి ప్రియ విభుడు,
సత్యకూ ఇష్ట సఖుడు,
మీరా మానస చోరుడు
ఎవ్వరీతడు?
గోవర్ధన గిరి ధారి -
అరి దానవ మద సంహారి
తాపస జన మానస సంచారి
భక్తానుగ్రహ తత్పర బద్ధ మురారి
యమునా తట స్థిత బృందావన విహారి
ఎవ్వరీతడు?
జయదేవుని గీతంలో అల్లరి గోవిందుడు
గోపాలురు కొలిచినట్టి కొండంత దేవుడు
గీతార్ధ సారమిడిన మాయా ముకుందుడు
పార్థసారథిగా సమరము నడిపిన పద్మనాభుడు
అల వైకుంఠ ధాముడు అవతరించినాడు
ఇల బాల గోపాలుడైన శ్రీమన్నారాయణుడు
క్రిష్ణుని గురించి చాలాబాగా రాసారు
ఈ కవిత చాలా బాగుంది. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా వ్రాసారు.
ధన్యవాదాలు!
‘కృష్ణం వందే జగద్గురుం’ కవిత చాలా బాగుంది!
కృతజ్ఞతలు!