వేదం
వేదం వాదమని, భేదమని, వేదనని
వాదించటం వెర్రితనం.
వాదం, భేదం, వేదన వేదంలో లేవు,
వేదానికి అవి అర్ధాలుకావు.
నీ ఆలోచనలోనే భేదముంది,
ఆ భేదమే నిన్ను వాదించమంటోంది,
ఆ వాదనే నీకు వేదననిస్తోంది.
ప్రేమకు పరమార్ధం వేదం,
మోదానికి మరో అర్ధమే వేదం,
ఇది తెలిస్తేనే ఆమోదం.
శోధనకు సాధన తోడైతే,
సాధనకు శోధన నీడైతే,
విశ్వాసమే నీ శ్వాస ఐతే,
ఆనందమే నీ ఆశ ఐతే,
వేదాలన్నీమోదాలే, ఆమోదాలే.
అజ్ఞానం, అహంకారం వలన కలిగే
ఆవేశాలన్నీ క్రోధాలే, బేధాలే,
రాగం వల్ల కలిగే రోగపు రోదనలే,
మమతల వల్ల కలిగే మోహాలన్నీ మోసాలే.
వేదం నీ జీవన నాదమని అవలోకించు.
శుద్ధమైన బుద్ధితో దాన్ని ఆలకించు.
వేదం నీ జీవన తేజం,
దాన్నిఆహ్వానించు. అనంతంగా అనుభవించు.
వేదానికి ఉన్న అర్థం, పరమార్థం ఏమిటో
చక్కని పదాలతో తెలియచేశారు. కవిత
బాగుంది.
🙏