చాలా సందర్భాలలో పరస్పరం వ్యతిరేకార్థంతో ఉండే కొన్ని జంట పదాలను వివిధ విషయాలను సరి పోల్చడానికి ఉపయోగిస్తుంటాము. అటువంటి కొన్నిటిని ఈ సంచికలో తెలుసుకుందామా?
ఉదా: అన్నదమ్ముల గుణాలలో ‘హస్తి మశకాంతరం తేడా ఉంది’ (హస్తి : ఏనుగు, మశకం : దోమ )
ఈ వాక్యాలలోని ఖాళీలను సరైన జంట పదాలతో పూరించండి ... (* గుర్తులో )
- * * - * * తెలుసుకుని మసలుకోవాలి
- * * - * * తారతమ్యం లేని సమ సమాజం రావాలి
- * * - * * * చూసి నడుచుకోవాలి
- ఈ రెండూ ఎప్పటికీ కలవవు ..........* * - * *
- ఈ రెండూ ఒకదానినొకటి వెన్నంటే ఉంటాయి .......* * * - * * *
- ఇవి దైవాధీనం ......... * * * - * * *
- ఆకారాన్ని చూసి ఒక వ్యక్తి * * - * * చెప్పడం కష్టం
- జీవితచక్రంలో భాగాలు ......... * * * - * * *
- మానవుడు వీటి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ...* * - * * *
- * * * - * * * , * * - * * * .......కావడిలో కుండలనే భయమేలోయి?