Menu Close
Puzzle Page Banner

చాలా సందర్భాలలో పరస్పరం వ్యతిరేకార్థంతో ఉండే కొన్ని జంట పదాలను వివిధ విషయాలను సరి పోల్చడానికి ఉపయోగిస్తుంటాము. అటువంటి కొన్నిటిని ఈ సంచికలో తెలుసుకుందామా?

ఉదా: అన్నదమ్ముల గుణాలలో ‘హస్తి మశకాంతరం తేడా ఉంది’ (హస్తి : ఏనుగు, మశకం : దోమ )

ఈ వాక్యాలలోని ఖాళీలను  సరైన జంట పదాలతో పూరించండి ... (* గుర్తులో )

  1. * * - * * తెలుసుకుని మసలుకోవాలి    ‌
  2. * * - * * తారతమ్యం లేని సమ సమాజం రావాలి
  3. * * - * * * చూసి నడుచుకోవాలి
  4. ఈ రెండూ ఎప్పటికీ కలవవు ..........* * - * *
  5. ఈ రెండూ ఒకదానినొకటి వెన్నంటే ఉంటాయి .......* * * - * * *
  6. ఇవి దైవాధీనం ......... * * * - * * *
  7. ఆకారాన్ని చూసి ఒక వ్యక్తి * * - * * చెప్పడం కష్టం
  8. జీవితచక్రంలో భాగాలు ......... * * * - * * *
  9. మానవుడు వీటి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ...* * - * * *
  10. * * * - * * * , * * - * * * .......కావడిలో కుండలనే భయమేలోయి?
సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »

సమాధానాలు :

  1. మం చి – చె డు
  2. బీ ద – గొ ప్ప
  3. ముం దు – వె ను క
  4. నిం గీ – నే లా
  5. చీ క టి – వె లు గు
  6. గె లు పు – ఓ ట మి
  7. దొం గ –దొ ర
  8. జ న నం – మ ర ణం
  9. ఆ శ – ని రా శ
  10. క లి మి  – లే ము లు , క ష్ట – సు ఖా లు
Posted in July 2019, మెదడుకు మేత

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!