Menu Close
నేటి మనిషి
- రాఘవ మాష్టారు
కందం: పూజల్ జేతుము మంత్రాల్
బాజాలియాడంబరాలు వర్ధిల్లగన్
రోజూ మనకై మరి యే
రోజూ ప్రజకోసమెవ్వరూ కోరుటలే?
కందం: ఇచ్చలు తీరిన నీ మెర
మెచ్చులు వచ్చిన యదేచ్ఛ వేలుల్ లచ్చల్
వచ్చిన నీకును నచ్చిన
లచ్చిమి వచ్చినను మచ్చరము పోదు గదా!
కందం: సత్తు చిత్తు రాని తత్తర
బిత్తర అత్తి కొని బత్తి భీతిన్ సత్తిన్
ముత్తికి భుత్తికి సత్తుకి
మత్తపు చిత్తమున కొల్చు మనుషుల్ హెచ్చెన్
కందం: లక్షణముగాను వెలుగున్
లక్షల దీపాల్ మన గుడుల మనిషి యందున్
శిక్షణకైన మనసున యొ
క క్షణము జ్ఞానదీపిక వెలుగదు గదా!
కందం: తిరుగును తీర్థాలందున్
తిరుగును కొండలు గుడులును తిరుగును ప్రీతిన్
తిరుగడు తన చుట్టూతా
నెరిగి యంతరమున పెను యెదరిన్ పట్టన్

సూచన: పెను యెదరి = పరమాత్మ, సత్తిన్ =శక్తిన్, ముత్తి = ముక్తి, భుత్తి = భుక్తి, సత్తు = బలం

Posted in July 2019, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!