Menu Close
సామెతల ఆమెతలు
సమీకరించినది: వెంపటి హేమ (కలికి)

౫౩౧. మూడు పూలకు ఆరు కాయలు.

౫౩౨. కొంకినక్కకేలనో ఈ పొలిమేర పంచాయతీ...

౫౩౩. తన చుట్టూ సముద్రం పెట్టుకుని చేప దూప కేడ్చినదిట!

౫౩౪. పుండుకి కారం రాసినట్లు ...

౫౩౫. అడ్డాల్లో బిడ్డలుగాని, గడ్డాలొచ్చాక కాదు.

౫౩౬. వట్టిగొడ్డుకి అరుపు లెక్కువ.

౫౩౭. ఇంటికంటే గుడి పదిలం.

౫౩౮. తినా తిరగా సరిపోయింది, ఇక తీర్థం వెళ్ళే పోద్దేదీ!

౫౩౯. సిరి వస్తే మోకాలడ్డం పెడతారా ఎవరైనా...

౫౪౦. గతజల సేతుబంధనం వల్ల ప్రయోజనం శూన్యం.

౫౪౧. ఆకలి రుచెరుగదు, చిడుము సిగ్గెరుగదు.

౫౪౨. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు.

౫౪౩. తడిపి మోపెడు చేసినట్లు ...

౫౪౪. తాడిచెట్టు ఎక్కా వెందుకురా - అని అడిగితే, దూడకు గడ్డికోసం - అన్నాడుట!

౫౪౫. కామధేనువునైనా కడకు తోలేది కబేలాకే...

౫౪౬. బతకని బిడ్డ బారెడు.

౫౪౭. చచ్చినవాని కళ్ళు చారెడేసి ...

౫౪౮. ముక్కుకు మసి రాసుకుని వచ్చి, కయ్యానికి కాలుదువ్వినట్లు.

౫౪౯. ఎద్దు పుండు కాకికి నొప్పా...

౫౫౦. రోటిలో తల చిక్కుకున్నాక, ఇక రోకటి పోటుకా వెరపు!

౫౫౧. గోరుచుట్టు మీద రోకటి పోటులా ...

౫౫౨. వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు ఠా!

౫౫౩. కవిత్వం పొద్దెరుగదు, రాజకీయం సిగ్గెరుగదు.

౫౫౪. కుదిరితే జయభేరీ, కుదరకపోతే రణభేరీ ...

౫౫౫. ఎత్తెత్తి అడుగులేసే ఎల్లమ్మ, ఎగిరి పుల్లాకుమీద దూకినట్లు ...

౫౫౬. పిండిబొమ్మను చేసి పీటమీద పెట్టి, "ఏమమ్మా అత్తమ్మా" అంటే ఎగిరెగిరి పడిందిట!

౫౫౭. చదువుకున్నవాడికంటే చాకలాడు మేలు.

౫౫౮. రోగం రొష్టు చెయ్యాలి, కాపురం గుట్టుచెయ్యాలి.

౫౫౯. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు - అన్నట్లు ...

౫౬౦. పిడక్కీ, బియ్యానికీ ఒకటే మంత్రమా ...

Posted in July 2019, సామెతలు

1 Comment

  1. మైలవరపు

    వెంపటి వారూ, అతి మధురము – వీటికి మీ వ్యాఖ్య (క్లుప్తముగానైనా) లభించితే మరింత మధురము 🙏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!