Menu Close
‘ప్రసాదం’
- రాఘవ మాష్టారు -

చీకటి వేళ వచ్చారు
“దారి తెన్ను కాన రాలేదు
కాస్త ఆశ్రయమివ్వండి చాలు
తెల్లారే వెళతాం” అన్నారు

నా గానంతో గానం కలిపారు
నా రాగానికి తాళం వేసారు

నిశ్శబ్దంగా
ఓ మూల కూర్చున్నారు
దీనుల్లా కనిపించారు

కానీ...
వారు తెచ్చుకున్న
ప్రేమామృత ప్రసాదాన్ని
నాకు వదిలి వెళ్ళారు

Posted in July 2022, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!