పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
తల్లిని మించిన దైవం లేదు. తల్లి అందరికీ ప్రథమ గురువు....ఇది అందరూ అంగీకరించే సత్యం.
అమ్మ పై వ్రాసిన పంచపదులు.......”అమ్మలందరికీ అంకితం”
1 – 4 పంచపదులకు అంత్య ప్రాస : నీయం
5 వ పంచపదికి అంత్యప్రాస : ము
అమ్మ పంచపదులలో ఇంకొక ప్రత్యేకత ...ఆది ప్రాస కూడా అమిరింది.....: అమ్మ
1.
అమ్మ రూపం 'రమణీయం'
అమ్మ పలుకు 'శ్రవణీయం'
అమ్మ చేతి భోజనము 'కమనీయం'
అమ్మ చల్లని చూపు 'ఉపశమనీయం'
అమ్మ మనసు మమతల మూట సత్యా!
అమ్మ పలుకు 'శ్రవణీయం'
అమ్మ చేతి భోజనము 'కమనీయం'
అమ్మ చల్లని చూపు 'ఉపశమనీయం'
అమ్మ మనసు మమతల మూట సత్యా!
2.
అమ్మ నడత 'అనుసరణీయం'
అమ్మ సహనం 'అనుకరణీయం'
అమ్మ సధ్భోధలు 'ఆచరణీయం'
అమ్మ ఆజ్ఞ 'శిరోధారణీయం'
అమ్మని ప్రేమతో చూడాలి సత్యా!
అమ్మ సహనం 'అనుకరణీయం'
అమ్మ సధ్భోధలు 'ఆచరణీయం'
అమ్మ ఆజ్ఞ 'శిరోధారణీయం'
అమ్మని ప్రేమతో చూడాలి సత్యా!
3.
అమ్మ సన్నిధి 'అనుభవనీయం'
అమ్మ దక్షత 'అభినందనీయం'
అమ్మ సేవా నిరతి 'శ్లాఘనీయం'
అమ్మ త్యాగం ‘ప్రశంసనీయం’
అమ్మ మనసు కష్ట పెట్టరాదు సత్యా!
అమ్మ దక్షత 'అభినందనీయం'
అమ్మ సేవా నిరతి 'శ్లాఘనీయం'
అమ్మ త్యాగం ‘ప్రశంసనీయం’
అమ్మ మనసు కష్ట పెట్టరాదు సత్యా!
4.
అమ్మతో అనుచిత వర్తన 'వర్జనీయం'
అమ్మంటే గౌరవం 'వాంఛనీయం’
అమ్మ మమత 'అనిర్వచనీయం'
అమ్మ ఎల్లప్పుడూ ‘పూజనీయం’
అమ్మ తోడు చల్లని నీడ సత్యా!
అమ్మంటే గౌరవం 'వాంఛనీయం’
అమ్మ మమత 'అనిర్వచనీయం'
అమ్మ ఎల్లప్పుడూ ‘పూజనీయం’
అమ్మ తోడు చల్లని నీడ సత్యా!
5.
అమ్మ దీవెన పొందుట సుకృతము
అమ్మ ప్రేమ మాధుర్యము అమృతము
అమ్మ ఇలను దైవమన్నది సూనృతము
అమ్మకు సాటిగలరన్నది అనృతము
అమ్మని గుండెలో నిలిపి పూజించాలి సత్యా!
అమ్మ ప్రేమ మాధుర్యము అమృతము
అమ్మ ఇలను దైవమన్నది సూనృతము
అమ్మకు సాటిగలరన్నది అనృతము
అమ్మని గుండెలో నిలిపి పూజించాలి సత్యా!
వచ్చే నెల మరికొన్ని పంచపదులతో కలుసుకుందామా!