Menu Close
Kadambam Page Title
ఓ యువతా నీ గమ్యం
-- కొడుపుగంటి సుజాత

యువతా నిజాయితీకి
ప్రతిరూపం నువ్వు
సాగించు నీ గమనం
తూరుపు వేకువ వైపు

శ్రీశ్రీ గారి విప్లవ భావాలకు
నువ్వు విజయ శంఖం పూరించు

నీ చేతులు అన్యాయాన్ని
చిదిమేసే కబంధ హస్తాలు
కావాలి

నీ కాళ్లు అక్రమాలని
అణచి వేసే
వామన పాదమై ప్రగతి
వైపు పరుగులు తీయాలి

నీ కళ్ళు చీకటిని చీల్చే
ఉషోదయ కిరణాలై
రేపటి తరానికి వెలుగు మార్గాలుగా
వెన్నెలలు కురిపించాలి

నీ మనసు మానవత్వంతో
పురివిప్పిన మయూరమై
మకరంధాల మధురిమ కావాలి

బాపూజీ కలలు కన్న మరో
ప్రపంచానికి నాంది నువ్వే

చాచాజీ శాంతి సామరస్యానికి
తెల్ల పావురం నీవై ఎగరాలి

శాస్త్రీజీ, జై జవాన్ జై కిసాన్
నినాదం నువ్వై
గగనాంతరం వరకు ప్రతిధ్వనించాలి

ఇంక్విలాబ్ జిందాబాద్
అంటూ మరో భగత్ సింగ్
యువ చైతన్యం నువ్వై
నవ సమాజ నిర్ణేతవు కావాలి

అంతవరకు
నీ ప్రయాణం ఆపబోకు
స్వాతంత్ర్య సమర నేతల
ఆశయాలు సిద్ధించే వరకు
నువ్వొక గమ్యం లేని గమనానివి.

Posted in April 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!