Menu Close
mg

ముందు తెలిసెనా ప్రభూ

చిత్రం: మేఘసందేశం (1982)
సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ముందు తెలిసెనా ప్రభూ..
ఈ మందిరమిటులుంచేనా ... మందమతిని
నీవు వచ్చు మధుర క్షణమేదో
కాస్త .. ముందు తెలిసెనా ప్రభూ

ముందు తెలిసెనా ప్రభూ..
ఈ మందిరమిటులుంచేనా ... మందమతిని
నీవు వచ్చు మధుర క్షణమేదో
కాస్త .. ముందు తెలిసెనా ప్రభూ ..

చరణం 1:

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే....
అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే..

సుందర మందారకుంద సుమదళములు పరువనా
సుందర మందార కుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును..

ముందు తెలిసెనా ప్రభూ..

ఈ మందిరమిటులుంచేనా ... మందమతిని
నీవు వచ్చు మధుర క్షణమేదో
కాస్త .. ముందు తెలిసెనా ప్రభూ ...

చరణం 2:

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు
బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు

ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగా
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి...

ఈ మందిరమిటులుంచేనా ... మందమతిని
నీవు వచ్చు మధుర క్షణమేదో
కాస్త .. ముందు తెలిసెనా ప్రభూ ...

Posted in April 2020, పాటలు