Menu Close
Kadambam Page Title
చిరుదివ్వె (వచన కవిత)
-- వెంపటి హేమ (కలికి)

ఒక దివ్వెను వెలిగించు -
అది ఎంత చిన్నది ఐనా
ఎంతో కొంత, రవంత
చీకటి నయినా అది
దవ్వులకు పారదోలకపోదు.

ఒక మంచిపనిని జరిపించు -
అది ఎంతోకొంత - ఎవరికో
రవంత జీవితాశను కల్పించి
మరింతకాలం బ్రతికించకపోదు.

సత్యకవి వాక్కు వలెనే
సత్కార్యం ఏదైనా కూడా
నలుగురి మనస్సులో నిలిచి
సత్ఫలితాలనందించకపోదు!

సమసమాజ నిర్మాణానికి
చీకటి నిండిన ఈ లోకంలో
ఎన్ని హృదయాలు రగించాలో
ఎన్నెన్ని దీపాలు వెలిగించాలో!

*** *** *** ***
("ఆంధ్రభూమి"వీక్లీ సౌజన్యంతో)

Posted in April 2020, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *