నేటి మనిషి
కందం: | పూజల్ జేతుము మంత్రాల్ బాజాలియాడంబరాలు వర్ధిల్లగన్ రోజూ మనకై మరి యే రోజూ ప్రజకోసమెవ్వరూ కోరుటలే? |
కందం: | ఇచ్చలు తీరిన నీ మెర మెచ్చులు వచ్చిన యదేచ్ఛ వేలుల్ లచ్చల్ వచ్చిన నీకును నచ్చిన లచ్చిమి వచ్చినను మచ్చరము పోదు గదా! |
కందం: | సత్తు చిత్తు రాని తత్తర బిత్తర అత్తి కొని బత్తి భీతిన్ సత్తిన్ ముత్తికి భుత్తికి సత్తుకి మత్తపు చిత్తమున కొల్చు మనుషుల్ హెచ్చెన్ |
కందం: | లక్షణముగాను వెలుగున్ లక్షల దీపాల్ మన గుడుల మనిషి యందున్ శిక్షణకైన మనసున యొ క క్షణము జ్ఞానదీపిక వెలుగదు గదా! |
కందం: | తిరుగును తీర్థాలందున్ తిరుగును కొండలు గుడులును తిరుగును ప్రీతిన్ తిరుగడు తన చుట్టూతా నెరిగి యంతరమున పెను యెదరిన్ పట్టన్ |
సూచన: పెను యెదరి = పరమాత్మ, సత్తిన్ =శక్తిన్, ముత్తి = ముక్తి, భుత్తి = భుక్తి, సత్తు = బలం